తమిళ్ హీరో విష్ణు విశాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆరణ్య సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ ఏడాది ఇప్పటికే ‘ఎఫ్‌ఐఆర్’ చిత్రంతో మరో హిట్ ను అందుకున్నాడు. ఈసినిమా తెలుగులోనూ మంచి విజయం సాధించింది. ఇక ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్ తో వచ్చేస్తున్నాడు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో చెల్లా అయ్యవు దర్శకత్వంలో మట్టి కుస్తీ అనే సినిమాతో వచ్చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. అయితే ఈసినిమా నుండి చాలా రోజులుగా ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు మేకర్స్. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ అప్ డేట్ ను ఇచ్చారు. ఫస్ట్ లుక్ ను నవంబర్ 2వ తేదీన ఉదయం 11గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
The game is about to begin!#GattaKusthi #MattiKusthi
First look at 11AM on the 2nd of November 👊
Are you ready? pic.twitter.com/8uC3ONDokx
— VISHNU VISHAL (VV) (@TheVishnuVishal) November 1, 2022
కాగా ఈసినిమాలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా నటిస్తుంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రిచర్డ్ ఎం.నాథన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని విష్ణు విశాల్ స్టూడీయోస్, ఆర్‌టీ టీమ్ వర్క్స్ బ్యానర్‌లపై విష్ణు విశాల్, రవితేజ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విష్ణు విశాల్ నుండి వచ్చిన ఎఫ్.ఐ.ఆర్ సినిమా తెలుగులో ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై రవితేజ సమర్పణలోనే విడుదలైంది. ఇప్పుడు ఇది రెండో సినిమా. ఈసినిమాను వచ్చే ఏడాది ప్రథమార్థంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: