పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఆదిపురుష్. ఈసినిమా కోసం ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈసినిమానుండి షూటింగ్ అప్ డేట్స్ తప్ప టీజర్ విడుదలయ్యే వరకు ఒక్కటంటే ఒక్క పోస్టర్ కూడా విడుదల చేయలేదు దర్శకుడు ఓం రౌత్. దాంతో వైపరీతమైన అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఫైనల్ గా అయితే ఎన్నోరోజుల నుండి ఎదురుచూస్తున్న టీజర్ ఈనెల 2వ తేదీన రిలీజ్ చేశారు. టీజర్ మాత్రం సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకొని సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాలో వీఎఫ్ఎక్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మాత్రమే ఎక్కువ టైము పడుతుంది. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా డబ్బింగ్ పనులను మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే కృతిశెట్టి తన డబ్బింగ్ ను మొదలుపెట్టేసింది. ఈ విషయాన్ని కృతిశెట్టి తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. మొత్తానికి ఆదిపురుష్ టీమ్ చెప్పిన టైమ్ కే సినిమాను రిలీజ్ చేయాలని ప్రయత్నిస్తున్నట్టే తెలుస్తుంది.
కాగా మైథలాజికల్ సినిమాగా ఈసినిమాను తెరకెక్కించాడు ఓం రౌత్. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించాడు. ప్రభాస్‌కు జోడీగా కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: