మెగా కాంపౌండ్ నుండి ఇప్పటికే చాలా మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. ఇక ఎవరికి వారు తమ సినిమాలతో బిజీగా కెరీర్ లో కొనసాగుతున్నారు. అందులో సాయి తేజ్ కూడా ఒకరు. తన సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతెచ్చుకున్నాడు సాయితేజ్. గత ఏడాది రిపబ్లిక్ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చి ప్రేక్షకులను అలరించాడు సాయితేజ్. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈసినిమా తరువాత కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ మిస్టికల్ థ్రిల్లర్ నేపథ్యంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే కదా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈసినిమా ప్రారంభించే లోపే సాయి తేజ్ బైక్ యాక్సిడెంట్ కు గురయ్యాడు. దాంతో ఈసినిమా షూట్ కు బ్రేక్ వచ్చింది. అయితే ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను మళ్లీ మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా కన్నడ సంగీత దర్శకుడు అంజనీష్ లోక్‌నాథ్‌ను తీసుకున్నారు. విక్రాంత్ రోణ, కాంతార సినిమాలతో అంజనీష్ లోక్ నాథ్ వర్క్ చేసి మంచి గుర్తింపు పొందాడు. దీంతో ఈసినిమాకు కూడా అంజనీష్ లోక్ నాథ్ ను తీసుకున్నారు.
కాగా ఈసినిమాలో సంయుక్త మీనన్ కథానాయిక గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో బ్రహ్మాజీ, అజయ్, సునీల్ తదితరులు పలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: