కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకండా వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి సినిమాల్లో ఈమధ్య కాలంలో వచ్చిన డీజే టిల్లు సినిమా కూడా ఒకటి. విమల్ కృష్ణ దర్శకత్వంలో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా డీజే టిల్లు. ఈసినిమా ఫిబ్రవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా పెద్ద హిట్ అయింది. కలెక్షన్ల పరంగా కూడా సాలిడ్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా సిద్ద జొన్నలగడ్డ తన టైమింగ్ తో బాడీ లాంగ్వేజ్ తో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాకు సీక్వెల్ కూడా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ కూడా మొదలయిపోయింది. ఇక తాజాగా ఈసినిమాలో హీరోయిన్ పై క్లారిటీ ఇచ్చాడు సిద్దూ. స్వాతిముత్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న సిద్దూ ఈసినిమా గురించి మాట్లాడుతూ.. డీజే టిల్లు2 సినిమా షూటింగ్ మళ్లీ స్టార్ట్ అయిందని.. ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్నట్టు తెలిపాడు. అయితే ముందు ఈ సీక్వెల్ లో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నట్టు తెలిపారు. అయితే కొన్ని కారణాల వల్ల శ్రీలీల ఈ ఈసినిమా నుండి తప్పుకున్నట్టు తెలుస్తుంది.
ఇక ఈసినిమాను కూడా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈసినిమాకు సంబంధించిన వివరాలు త్వరలో తెలియచేయనున్నారు. మరి డీజే టిల్లు అయితే సూపర్ హిట్ అయింది. ఈసీక్వెల్ ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: