దసరా ధూమ్ ధామ్ దోస్తాన్ సాంగ్ రిలీజ్

Dhoom Dhaam Dhosthaan Song Out Now, Dhoom Dhaam Dhosthaan Out Now, Dhoom Dhaam Dhosthaan First Single Out Now, Dasara Movie Songs, Nani Latest Movie, Nani's Upcoming Movie, Dasara Telugu Movie Songs, Keerthy Suresh, Samuthirakani, Sai Kumar, Srikanth Odela, Dasara, Dasara Telugu movie, Dasara New Update, Dasara Telugu Movie New Update, Dasara Movie, Dasara Latest Update, Dasara Movie Updates, Dasara Telugu Movie Live Updates, Dasara Telugu Movie Latest News, Dasara Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ఈమధ్య హీరోలు విభిన్నమైన పాత్రలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రొటీన్ గా కమర్షియల్ సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా తమను విభిన్నమైన పాత్రల ద్వారా ఆవిష్కరించుకోవడానికి ముందుకొస్తున్నారు. ఇక అలాంటి ప్రయోగాలు చేయడానికి ఏమాత్రం వెనుకాడని హీరోల్లో నాని కూడా ఒకరు. విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఈ ఏడాది అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆ సినిమాతో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న సినిమా దసరా. తెలంగాణ రాష్ట్రంలోని సింగ‌రేణి బొగ్గు గ‌నుల బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తెర‌కెక్కుతోంది. ఈసినిమాలో నాని ఫుల్ మాస్ రోల్ లో నటిస్తున్నాడు. ఇప్పటివరకూ తను చేసిన పాత్రలకు భిన్నంగా ఈ సినిమాలో చేయబోతున్నాడు. ఇక ఈసినిమా ఒకపక్క షూటింగ్ ను ముగించుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. దీనిలోభాగంగానే తాజాగా ఈ సినిమా ధూమ్ ధామ్ దోస్తాన్ అనే పాటను రిలీజ్ చేశారు. ‘ఇచ్చి పడేద్దాం .. గుచ్చి పడేద్దాం .. ఎవ్వడడ్డమొత్తడో చూద్దాం .. బాంచత్. ధూమ్ ధామ్ దోస్తాన్ .. ఇరగమరగా జేద్దాం’ అంటూ ఈ పాట సాగుతోంది. సంతోష్ నారాయణ్ ఈ పాటను కంపోజ్ చేయగా, రాహుల్ సిప్లిగంజ్, పాలమూరు జంగిరెడ్డి, నర్సమ్మ, గొట్టె కనకవ్వ, గన్నోర దాసు లక్ష్మి అద్భుతంగా పాడారు. తెలంగాణా స్టైల్‌లో కాసర్ల శ్యామ్ ఈ పాటను రాశారు. బొగ్గు గనుల్లో హీరో, అతని స్నేహితులపై మాస్ స్టైల్ లో చిత్రీకరించిన ఈసాంగ్ అందరినీ ఆకట్టుకుంటుంది.

కాగా ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా.. ఎడిటర్‌గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా విజయ్‌ చాగంటి వ్యవహరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 18 =