మంచు విష్ణు చివరిగా మోసగాళ్లు అనే సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. అయితే ఈసినిమా విష్ణు కు ఆశించినంత ఫలితాన్ని అయితే అందించలేకపోయింది. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత మరో సినమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆసినిమానే జిన్నా. ఈషాన్ సూర్య దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో విష్ణు గాలి నాగేశ్వర్రావు అనే పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుందని ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, టీజర్ ను బట్టి అర్థమవుతుంది. అంతేకాదు ఆ అప్ డేట్స్ అన్నీ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. ముందునుండీ అనుకుంటున్నట్టే ఈసినిమా ట్రైలర్ అక్టోబర్ 5వ తేదీన దసరా పండుగ సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. నిజానికి ఈసినిమాను ముందు అక్టోబర్5వ తేదీన రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు. కానీ అదే రోజు పలు పెద్ద సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉండటంతో ఈసినిమాను పోటీ నుండి తప్పించారు. రీసెంట్ గానే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. అక్టోబర్ 21వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
కాగా ఈసినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటి సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. కథ, స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్. డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చో టా.కె.నాయుడు.. భాను, నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: