బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో గణేష్. ఇప్పటికే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సినిమాలు చేస్తూ కెరీర్ ను లీడ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన తమ్ముడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.
లక్ష్మణ్ కె కృష్ణ డైరెక్షన్ లో గణేష్ హీరోగా వస్తున్న సినిమా స్వాతిముత్యం. ఈసినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు గణేష్. దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్య క్రమాలలో స్పీడ్ పెంచారు . ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్ పాటలు విడుదలై ఆకట్టుకోగా తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ట్రైలర్ విషయానికొస్తే ట్రైలర్ కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. ట్రైలర్ చూస్తుంటే ఈసినిమా మొత్తం హీరో పెళ్లి చుట్టే తిరిగినట్లు కనిపిస్తుంది. ‘నిన్న నైట్ ఒక మూవీ చూశాను అండి. దానిలో కూడా హీరో హీరోయిన్లు మనలాగే.. కాఫీ షాప్ లో కలుస్తారు’ అంటూ సాగిన ఈ ట్రైలర్ సినిమా పై ఉన్న భారీ అంచనాలను పెంచేసింది. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, అలాగే విజువల్స్, ఇంకా కామెడీ బాగానే కనిపిస్తున్నాయి. ట్రైలర్ అయితే మొత్తానికి సినిమాపై అంచనాలు పెంచేసింది. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
Packed with lots of love, fun, emotions & entertainment ❤️#SwathimuhtyamTrailer out ▶️ https://t.co/FxR1cCjSwn
In cinemas #SwathimuthyamOnOct5th✨ #Ganesh @VarshaBollamma @Lakshmankkrish2 @mahathi_sagar @dopSURYAA @NavinNooli @vamsi84 @adityamusic @SitharaEnts pic.twitter.com/9lEgAIaXgL
— Sithara Entertainments (@SitharaEnts) September 26, 2022
ఇక ఈసినిమాలో బెల్లంకొండ గణేష్ సరసన వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తుండగా ఇతరపాత్రల్లో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద నటిస్తున్నారు. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈసినిమాకు మహతి సాగర్ సంగీతం అందిస్తుండగా సూర్య సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: