టాలెండెట్ హీరో శ్రీ విష్ణు మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళిపోతున్నాడు. ఇక రీసెంట్ గానే అల్లూరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీవిష్ణు.. ఇప్పుడు మరో సినిమాను ప్రారంభించేశాడు. శ్రీవిష్ణు హీరోగా వివాహ భోజనంబు సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు రామ్ అబ్బరాజుతో చేతులు కలిపారు. శ్రీవిష్ణుతో చేయబోతున్న కొత్త చిత్రంతో రామ్ అబ్బరాజు థియేటర్ సినిమాకి పరిచయం కానున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పూర్తి ఫన్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమా ఈరోజు గ్రాండ్‌గా లాంచ్ అయింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనిల్ సుంకర, వీఐ ఆనంద్, నారా రోహిత్, విజయ్ కనకమేడల, ఏఆర్ మోహన్ పాల్గొన్నారు. ముహూర్తం షాట్‌కు నారా రోహిత్ క్లాప్ ఇచ్చారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
Back to my favourite genre to entertain you all ❤️
My next film with the talented @RamAbbaraju launched today 🪔
Elated to be working under the production of @AKentsOfficial & @HasyaMovies🎬
Excited to kickstart this!@AnilSunkara1 @RajeshDanda_ @GopiSundarOffl @_balajigutta pic.twitter.com/fFLb96y4yN
— Sree Vishnu (@sreevishnuoffl) September 25, 2022
కాగా ఈసినిమాకు భాను బోగవరపు కథని అందించగా, నందు సవిరిగాన డైలాగ్స్ అందిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తుండగా, రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా, ఛోటా కె ప్రసాద్ ఎడిటర్ గా బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తారు.
హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా నిర్మాణంలో ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. కంటెంట్ రిచ్ మూవీస్ చేస్తున్న హాస్య మూవీస్ ప్రొడక్షన్ నంబర్ 3గా ఈ సినిమా నిర్మాణం కానుంది. ఇప్పటికే ఈబ్యానర్ నుండి వస్తున్న అల్లరి నరేష్‌తో రూపొందిస్తున్న ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం విడుదలకు సిద్ధమవుతుండగా, సందీప్ కిషన్ హీరోగా ‘ఊరు పేరు భైరవకోన’ నిర్మాణ దశలో ఉంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: