శివ తుర్లపాటి దర్శకత్వంలో అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా గీతాంజలి మళ్లీ వచ్చింది. ఈసినిమా అంజలి సినిమాకు సీక్వెల్ గా వచ్చిన సినిమా అన్న సంగతి తెలిసిందే కదా. కామెడీ హార్రర్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా ఏప్రిల్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమా బాగానే ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఆహా వారు ఈసినిమా ఓటీటీ హక్కులను సొంతంచేసుకున్నారు. మే8వ తేదీ నుండి ఈసినిమా ఆహా లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు ఈసినిమా మరో ఓటీటీలోకి వచ్చేసింది. మరో ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వారు ఈసినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా అమెజాన్ ప్రైమ్ లో కూడా ఓటీటీలోకి వచ్చేసింది.
కాగా ఈసినిమాలో మలయాళ నటుడు రాహుల్ మాధవ్, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్‌లతో పాటు ఈ సీక్వెల్‌లో సత్య, సునీల్, రవిశంకర్, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రముఖ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పణలో ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ప్రతిష్టాత్మకంగా ఈసినిమాను నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























