కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

సత్యభామ థ‌ర్డ్ సింగిల్ అప్‌డేట్

Satyabhama Third Single to be Out on May 15

సత్యభామ థ‌ర్డ్ సింగిల్ అప్‌డేట్

Satyabhama Third Single to be Out on May 15

Satyabhama Third Single to be Out on May 15

భగవంత్ కేసరి సినిమాతో గ‌తేడాది మాసివ్ హిట్ అందుకుంది స్టార్ హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్. దీనితర్వాత ఆమె నటిస్తున్న తాజా చిత్రం 'సత్యభామ'. లేడీ ఓరియెంటెడ్‍గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో ఆమె ఒక పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనుంది. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నవీన్‌ చంద్ర క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. ఈ సినిమాకు “మేజర్” ఫేమ్ శశికిరణ్ టిక్క స్క్రీన్ ప్లే అందించడంతోపాటుగా సమర్పకులుగా కూడా వ్యవహరిస్తున్నాడు. అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు.

క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందిన ఈ మూవీ నుంచి ఇప్ప‌టికే విడుదలైన మొద‌టి రెండు పాటలు మరియు గ్లింప్స్‌ కూడా సినీప్రియులను బాగా అలరించాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు మేక‌ర్స్. ఈ మూవీ నుంచి 'వెతుకు వెతుకు' అనే థ‌ర్డ్ సింగిల్‌ను మే 15న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కాగా శ్రీ చరణ్‌ పాకాల సంగీతం అందిస్తున్న 'సత్యభామ' ఈ నెల 17న విడుదల కానుంది.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్