రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడి కర్ణాటక థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి.ప్రముఖ నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ ఈ హక్కులను భారీ ధరకు దక్కించుకుంది.ఈ బ్యానర్ ప్రస్తుతం కెజియఫ్ హీరో యష్ తో టాక్సిక్ అనే సినిమాను చేస్తుంది.ఇక ఈ సంస్థ కల్కి హక్కులను దక్కించుకోవడంతో కర్ణాటక లో భారీ స్థాయిలో విడుదలకానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే థియేట్రికల్ ,నాన్ థియేట్రికల్ కలిపి కల్కి 600కోట్లకు పైనే బిజినెస్ చేస్తుందని ట్రేడ్ అంచనావేస్తుంది.ఈసినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది.భారీ విఎఫ్ఎక్స్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాకి మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకుడు కాగా దీపికా పదుకోణ్ హీరోయిన్ గా నటిస్తుంది.అమితాబ్ బచ్చన్,కమల్ హాసన్,దిశా పటాని కీలక పాత్రల్లో కనిపించనున్నారు.సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా వైజయంతి మూవీస్ నిర్మిస్తుంది.జూన్ 27న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
ఇక వరుస షూటింగ్ లతో ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ బిజీ గా వున్నాడు.హీరోగా కల్కి తోపాటు రాజా సాబ్ సినిమా పూర్తి చేసే పనిలో వున్నాడు. ఇవి కాకుండా ప్రభాస్ ప్రస్తుతం కన్నప్పలో కూడా నటిస్తున్నాడు. ఇందులో ప్రభాస్ క్యామియో రోల్ లో కనిపించనున్నాడు. నిన్ననే ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఇక కల్కి విడుదల తరువాత ప్రభాస్, సలార్ 2 షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.ఈసినిమా షూటింగ్ జూన్ లో మొదలయ్యే ఛాన్స్ వుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























