పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా రూపొందిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ఇస్మార్ట్ శంకర్. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ 2 వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తిచేసుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈనెలలో రామ్ పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే కదా. రామ్ పుట్టినరోజుకు ఏదో ఒక అప్ డేట్ వస్తుందని చూస్తున్నారు. ఇప్పటికే టీజర్ రావచ్చన్న వార్తలు కూడా గతకొద్దిరోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి ఒక అప్ డేట్ వచ్చింది. చిత్ర నిర్మాణ సంస్థ రామ్ పోస్టర్ ను పోస్ట్ చేస్తూ దీంతల్లి దిమాక్ కిరికిరి అవుతుంది ‘ఏదో వచ్చేలా ఉంది’ అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు. మరి టీజర్ వస్తుందా లేకా ఏం అప్ డేట్ వస్తుందో చూడాలి..
Dhin thalli diMAKIKIRIKIRI aithandhi🧠
Edho Vacchelane undhi 👀#DoubleISMART pic.twitter.com/ZmO9h3sDj6— Puri Connects (@PuriConnects) May 11, 2024
కాగా ఈసినిమాలో ఇంకా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను పూరి కనెక్ట్స్ పై పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మించనున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో కూడా ఈసినిమా విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























