ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ది ఘోస్ట్. యాక్షన్ థ్రిల్లర్ గా ఈసినిమా వస్తుంది. ఈసినిమా అక్టోబర్ 5వ తేదీన రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఇప్పటినుండే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, పోస్టర్లు ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. రీసెంట్ గానే ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాలో భారీ యాక్షన్ తో పాటు ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్ ఇతర అంశాలు ప్రధాన ఆకర్షణగా ఉండబోతున్నాయని ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా మొదలుపెడుతున్నారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈసినిమా ఫస్ట్ సింగిల్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ వేగం సెప్టెంబర్ 16న విడుదల కానుంది. భరత్, సౌరబ్ ద్వయం ఈ పాటను స్కోర్ చేశారు. కపిల్ కపిలన్, రమ్య బెహరా పాడిన ఈ పాటకు కృష్ణ మాదినేని సాహిత్యం అందించారు.
కాగా ఈసినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో నాగార్జున, సోనాల్ చౌహాన్ ఇద్దరూ ఇంటర్‌పోల్ ఆఫీసర్స్‌గా కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాలో గుల్‌పనాగ్, అనిఖ సురేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: