హీరోగా చేయాలంటే మాములు విషయం కాదన్న సంగతి తెలిసిందే కదా. పాత్రలకు తగ్గట్టు తమ బాడీని మర్చుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి స్లిమ్ లుక్ లో, సిక్స్ ప్యాక్ లో కనిపించాల్సి వస్తే మరోసారి కాస్త లావుగా కనిపించాల్సి ఉంటుంది. ఇలా పాత్రకు తగ్గట్టు మేకోవర్ ను మార్చుకుంటారు. అయితే ఇకపై ఫ్యాట్ గా కనిపించే పాత్రలు చేయనంటున్నాడు శర్వానంద్. ఇటీవలే శ్రీకార్తిక్ దర్శకత్వంలో వచ్చిన ఒకే ఒక జీవితం సినిమాతో మంచి హిట్టందుకున్నాడు శర్వానంద్. చాలా కాలం తరువాత సక్సెస్ అందడంతో ప్రస్తుతం ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శర్వానంద్ ఫిట్ నెస్ గురించి మాట్లాడుతూ.. నేను ఫిట్‌గా మారేందుకు 9 నెలలు పట్టింది.. ఇకపై లావుగా కనిపించే పాత్రలు వస్తే మాత్రం నేను చేయను.. అన్నింటికంటే నా ఆరోగ్యం ముఖ్యం. నేను మళ్లీ బరువు పెరగడం ఇష్టం లేదు. బరువు పెరగడం సులభవం..కానీ బరువు తగ్గడం మాత్రం చాలా కష్టం అని చెెప్పుకొచ్చాడు. అంతేకాదు ఒకే ఒక జీవితం మూవీ తనకు కమ్ బ్యాక్ మూవీ అవుతుందని తనకు ముందే అర్థమైందని.. తను అనుకున్నదే ఇప్పుడు జరిగిందని తెలిపాడు.
ఈసినిమాలో శర్వానంద్ హీరోగా నటించగా రీతూవర్మ హీరోయిన్ గా నటించింది. అమల, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, ఆలీ, మధు నందన్ కీలక పాత్రల్లో నటించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ఆర్ ప్రభు ఈసినిమాను నిర్మించారు. జెక్స్ బిజోయ్ సంగీతం అందించగా.. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫి అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: