గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో శింబు హీరోగా వస్తున్న సినిమా ‘వెందు తనిందదు కాడు’. తెలుగులో ఈసినిమా ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ అనే టైటిల్ తో వస్తుంది. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసింది. తమిళంలో ఈసినిమా 15వ తేదీన రిలీజ్ అవుతుండగా.. తెలుగులో ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఇషారి. కె. గణేష్ భారీ ఎత్తున నిర్మించగా… ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ స్రవంతి మూవీస్ విడుదల చేస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలాఉండగా రామ్ తో సినిమాను కన్ఫామ్ చేశాడు గౌతమ్ మీనన్. రీసెంట్ గానే రామ్ తో నేను మాట్లాడాను.. వచ్చే ఏడాది మా సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాము.. స్రవంతి మూవీస్ బ్యానర్ పై ఈసినిమా తెరకెక్కనుంది అంటూ కన్ఫామ్ చేశాడు. మరి చూద్దాం వీరిద్దరి కాంబినేషన్ లో ఎలాంటి సినిమా వస్తుందో..
కాగా ప్రస్తుతం రామ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాను రాబరీ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈసినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈసినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాను కూడా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: