తమిళ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటివరకూ తన డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన విజయ్ ఇప్పుడు స్ట్రైయిట్ గా తెలుగు సినిమాతో వచ్చేస్తున్నాడు. తెలుగ, తమిళ్ రెండు భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. తమిళ్ లో వారసి టైటిల్ తో వస్తుండగా.. తెలుగులో వారసుడు అనే టైటిల్ తో వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈసినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు విజయ్ 100వ సినిమా ఓ ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్ 100వ చిత్రంలో విజయ్ హీరోగా నటించనున్నారు. ఈ విషయాన్ని ఎవరో కాదు నిర్మాణ సంస్థ అధినేత ఆర్. బి. చౌదరి తనయుడు, నటుడు జీవానే స్వయంగా తెలియచేశాడు. తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న జీవా సూపర్ గుడ్ ఫిల్మ్స్ లో విజయ్ 100వ సినిమా చేస్తున్నాడని తెలిపాడు. అంతేకాదు తనకూ సినిమాలో నటించే అవకాశం ఇవ్వాలని, రెమ్యూనరేషన్ కూడా తీసుకోనని చెప్పానని కామెడీ చేశాడు. కాగా గతంలో జీవా, విజయ్ తో కలిసి స్నేహితుడు సినిమాలో నటించాడు. ఈ ఇద్దరు కలిసి గతంలో ‘నన్‌బన్’ (స్నేహితుడు) అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. మరి, ఈ కొత్త చిత్రానికి దర్శకుడెవరు? వెంటనే ఈ సినిమా పట్టాలెక్కుతుందా? తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. మరి, ఈ సినిమాకు దర్శకుడెవరు? వెంటనే ఈ సినిమా పట్టాలెక్కుతుందా? అన్నది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: