ఉపేంద్ర కబ్జ ఫైనల్ రిలీజ్ డేట్ ఫిక్స్

upendra kabzaa movie teaser release date fixed, Kabza teaser release date, kabzaa movie teaser release date fixed, upendra kabzaa movie teaser, kabzaa movie teaser, Kabza teaser, Real Star Upendra's birthday, R Chandru, Upendra's Kabzaa movie, Upendra's Kabzaa Telugu movie Kabzaa movie, Kabzaa Telugu movie Upendra's Kabzaa, Upendra Latest Movie, Upendra Upcoming Movies, kabzaa teaser release date, kabzaa, kabzaa 2022, Telugu Filmnagar, Tollywood Latest, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Telugu Movies News

విభిన్నమైన సినిమాలు చేయడంలో కన్నడ విలక్షణ నటుడు ఉపేంద్ర ఎప్పుడూ ముందుంటాడు. ఇక ఇప్పుడు మరోసారి అలాంటి కథతోనే రాబోతున్నాడు. చంద్రు దర్శకత్వంలో ఉపేంద్ర , స్టార్ హీరో సుదీప్ ప్రధాన పాత్రల్లో వస్తున్న మల్టీ స్టారర్ కబ్జ. గతంలో చంద్రు-ఉపేంద్ర కాంబినేషన్ లో బ్రహ్మా, ఐ లవ్ యూ అనే సినిమాలు వచ్చాయి. ఇప్పుడు వస్తుంది మూడో సినిమా. ఇక ఈసినిమాను కన్నడతో పాటు తెలుగుతో పాటు పలు భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. నిజానికి ఈసినిమా షూటింగ్ కే చాలా బ్రేకులు పడ్డాయి. అయితే ఎలాగో షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. కానీ రిలీజ్ కు కూడా చాలా ఆలస్యమవుతూ వచ్చింది. ఇక మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టింది. దీనిలో భాగంగానే ఈసినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈనెల అంటే సెప్టెంబర్ 17వ తేదీన ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా 1970బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఉపేంద్ర గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాలో శ్రియ మధుమతి పాత్రలో నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో ప్రకాష్‌ రాజ్‌, జగపతిబాబు, కబీర్ సింగ్‌ దుహా, బోమన్‌ ఇరానీ తదితరులు నటిస్తున్నారు. శ్రీ సిద్దేశ్వర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతున్న ఈసినిమాను కన్నడ , తెలుగు , తమిళ భాషలతో పాటు మలయాళ, హిందీ, మరాఠి, బెంగాలీ భాషలలో డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ చేస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =