మొత్తానికి నిఖిల్ లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా కార్తికేయ2 తో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈసినిమాను కరోనా ముందు స్టార్ట్ చేశారు. కరోనా వల్ల మధ్యలో బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. ఫైనల్ గా అన్ని పరిస్థితులను అనుగుణంగా చేసుకొని ఈనెల 13వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేశారు. ఇక ఫస్ట్ షో నుండే ఈసినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. చందూ మొండేటి ఈసారి ద్వారక నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ గా కథను తెరకెక్కించాడు. అడ్వంచరస్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కిన ఈసినిమా అందరికీ నచ్చేస్తుంది. అందుకే సినిమా రిలీజ్ అయి దాదాపు పది రోజులు అవ్వస్తున్నా ఇంకా సక్సెస్ ఫుల్ గానే నడుస్తుంది. ఆఫ్ లైన్ లో టికెట్లు కూడా ఇప్పటికీ ఫుల్ గా సోల్డ్ అవుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరోవైపు కలెక్షన్స్ విషయంలో కూడా ఈసినిమా ఎక్కడా రాజీ పడట్లేదు. తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది. నార్త్ లో ఎక్కడా తగ్గట్లేదు. హిందీ సినిమాల వల్ల అక్కడ మొదట స్క్రీన్లు దొరకడమే కష్టంగా మారింది. మొదటి రోజు కేవలం 50 స్క్రీన్లలో మాత్రమే హిందీలో రిలీజ్ అయింది. ఇప్పుడు దాదాపు 1000 స్క్రీన్లను సొంతం చేసుకుందంటేనే చెప్పొచ్చు ఈసినిమాకు ఎంత క్రేజ్ పెరిగిందో. కేవలం ఇక్కడ మాత్రమే కాదు ఓవర్సీస్ లో కూడా కార్తికేయ 2 కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈసినిమా తాజాగా 1 మిలియన్ క్లబ్ లోకి చేరింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ కూడా తెలియచేసింది.
#Karthikeya2 is shaking the US Box Office 🔥
Crosses Coveted $ 1 MILLION and Marching Ahead Strong❤️🔥#KrishnaIsTruth#Karthikeya2Hindi@actor_Nikhil @anupamahere @chandoomondeti @AnupamPKher @AbhishekOfficl pic.twitter.com/nfl7FQQj4b
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) August 22, 2022
కాగా ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: