కరెక్ట్ అయినప్పుడు తగ్గేదేలేదు అంటున్న ‘లైగర్’

Vijay Deverakonda Responds to Liger Negativity,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies, Vijay Deverakonda,Hero Vijay Deverakonda,Vijay Deverakonda Liger Movie,Vijay Deverakonda Movie Updates,Vijay Deverakonda latest Updates,Vijay Deverakonda Response to Negative Comments, Vijay Deverakonda About Liger Negativity,Vijay Deverakonda Liger Movie latest Updates,Vijay Deverakonda Upcoming Movie Liger,Liger Telugu Movie,Liger pan India Movie,

బాలీవుడ్ లో ప్రస్తుతం బాయ్ కట్ సంప్రదాయం బాగా నడుస్తుంది. మరీ ముఖ్యంగా కరణ్ జోహర్ సినిమాలకు కొంతమంది వ్యతిరేకంగా సోషల్ మీడియాల్లో బాయ్ కట్ అంటూ ట్రెండింగ్ చేస్తున్నారు. కరణ్ జోహర్ పై నెపోటిజం ప్రభావం ఎప్పటినుండో ఉంది. స్టార్ కిడ్స్ కు మాత్రమే కరణ్ జోహర్ సపోర్డ్ ఉంటుంది అంటూ ఎప్పటినుండో నార్త్ ప్రజలకు ఒక అభిప్రాయం ఉంది. ఈనేపథ్యంలో ఇప్పుడు ఈ ఎఫెక్టే లైగర్ సినిమాపై పడింది. రెండు మూడు రోజుల నుండి ఈసినిమాను బాయ్ కట్ చేయాలని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొంతమంది నెటిజన్లు విజయ్ కి సపోర్టుగా నిలుస్తున్నారు. సినీ ఇండిస్టీలో ఎవరి సపోర్టు లేకుండానే విజయ్ ఈ స్థాయికి వచ్చారని తనకి మద్దతిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ దీనిపై స్పందిస్తూ.. ఒక సినిమా ద్వారా కొన్ని వేలమందికి జీవనోపాధి లభిస్తుంది. ఒక సినిమాను బాయ్ కాట్‌ చేయడం వల్ల.. సినిమాపై జీవనోపాధి పొందుతున్న వేలాదిమందిని ఇబ్బంది పెడుతున్నట్లే. బాయ్ కాట్‌ ట్రెండ్‌తో మీరు సినిమాపై ఆధారపడిన వారందరినీ, దేశ ఆర్థిక వ్యవస్థను ఇబ్బందిపెడుతున్నారు’ అని విజయ్ అన్నారు. ఇక తాజాగా తన ట్విట్టర్ ద్వారా దీనిపై స్పందిస్తూ తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చాడు. మనం కరెక్ట్ ఉన్నప్పుడు.. మన ధర్మం మనం చేసినప్పుడు ఎవ్వడి మాట వినేది లేదు కొట్లాడుదాం అంటూ కౌంటర్ ఇచ్చాడు.

కాగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే నటిస్తుండగా. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించనున్నారు. రమ్యకృష్ణ తోపాటు బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఆగష్ట్ 25న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − seven =