మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ హరి హర వీరమల్లు పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నిధి అగర్వాల్ , నర్గీస్ ఫక్రి కథానాయికలు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హరిహర వీరమల్లు మూవీ లోని ఒక భారీ యాక్షన్ సీన్ కై ఒక ప్రత్యేకమైన సెట్ ను మేకర్స్ రెడీ చేయించారు. ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ కోసం విదేశీ నిపుణులు కూడా పని చేస్తుండటం విశేషం.తాజాగా హరి హర వీరమల్లు మూవీ ని 2023 మార్చ్ 30 న ఈ సినిమాను రిలీజ్ చేస్తామని ప్రొడ్యూసర్ ఎ యమ్ రత్నం ప్రకటించారు . సూపర్ హిట్ భీమ్లా నాయక్ మూవీ తరువాత పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: