ఈషాన్ సూర్య దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా వస్తున్న సినిమా జిన్నా. చాలా గ్యాప్ తరువాత మంచు విష్ణు ఈసినిమాతో వస్తున్నాడు. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న’జిన్నా’ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసినిమా షూటింగ్ పూర్తి కావస్తుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేశారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి వరుసగా ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేశారు. దీనితో పాటు ఫ్రెండ్ షిప్ సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా టీజర్ రిలీజ్ కు టైమ్ ను ఫిక్స్ చేశారు. ఆగష్ట్ 25వ తేదీన ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ఈ టీజర్ విడుదలకానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటి సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. కథ, స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్. డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చో టా.కె.నాయుడు.. భాను, నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు. త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: