యూత్ &ఫ్యామిలీ ఆడియెన్స్ ని అలరిస్తూ వరుస సక్సెస్ ఫుల్ చిత్రాలతో నాగచైతన్య టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సింక్ సౌండ్ టెక్నాలజీ తో తెరకెక్కిన “థ్యాంక్యూ” మూవీ జూలై 22 వ తేదీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. రాశీ ఖన్నా , అవికాగోర్ , మాళవిక నాయర్ కథానాయికలు. థమన్ ఎస్ సంగీతం అందించారు. నాగ చైతన్య మూడు వేరియేషన్స్ ఉన్న రోల్ లో అద్భుతంగా పెర్ఫార్మన్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“థ్యాంక్యూ “మూవీ ఈ రోజు నుండి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్స్ లో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు అమెజాన్ ప్రైమ్ వీడియో లో వీక్షించి ఎంజాయ్ చేయండి. అమెజాన్ ప్రైమ్ కోసం నాగచైతన్య , విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్ “ధూత” వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న”# NC22″ మూవీ పూజాకార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: