అద్వైత్ చందన్ దర్శకత్వంలో ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా లాల్ సింగ్ చద్దా. అమెరికన్ క్లాసిక్ మూవీ “ఫారెస్ట్ గంప్” సినిమాకు ఈసినిమా రీమేక్. ఈసినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాదు ఈసినిమాతోనే నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఈసినిమా ఎలా ఉంది.. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చైతుకు ఈసినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. ఆమిర్ ఖాన్, నాగ చైతన్య, కరీనా కపూర్, మోనా సింగ్, మానవ్ విజ్ తదితరులు
డైరెక్టర్.. అద్వైత్ చందన్
బ్యానర్స్..ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్
నిర్మాతలు..ఆమిర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే
సంగీతం.. ప్రీతమ్
సినిమాటోగ్రఫి..సేతు
కథ..
అంగవైకల్యంతో బాధపడుతున్న పిల్లాడు తన తల్లి సహకారం ప్రోత్సాహంతో ఆర్మీలోకి వెళ్లాలని కలలు కంటాడు. ఆ తరవాత అతడు ఆర్మీలోకి వెళ్లడానికి ఎంత కష్టపడ్డాడు..? ఆర్మీలో చేరిన తరవాత రాష్ట్రపతి నుండి మెడల్ అందుకునే స్థాయికి ఎలా ఎదిగాడు అన్నదే ఈ సినిమా కథ..
విశ్లేషణ..
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ గురించి, ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పేదేం లేదు. ఏదైనా సినిమాను కమిట్ అయ్యాడంటే దానికి 100 శాతం కాదు 1000 శాతంన్యాయం చేస్తాడు. పాత్ర కోసం తన మేకోవర్ ను ఎలా మార్చుకోవాలన్నా వెనుకాడడు. అందుకే తన సినిమాలు అలాంటి విజయాలను దక్కించుకుంటాయి. ఇక తన నుండి సినిమా వచ్చి దాదాపు మూడేళ్లు అయిపోయింది. దీంతో లాల్ సింగ్ చద్దా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నేడు రిలీజ్ అయిన ఈసినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంటుంది.
ఆమిర్ ఖాన్ కూడా ఎప్పటిలాగే ఈసినిమాలో కూడా తన మార్క్ నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. సినిమా మొత్తం లాల్ పాత్రలో జీవించేశాడని చెప్పొచ్చు. ప్రతి చిన్న విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకొని ఎక్కడా ఓవర్ బోర్డ్ వెళ్లకుండా నటించాడు. చిన్పప్పటి పాత్ర నుండి ఆర్మీ వరకూ పలు షేడ్స్ లో వైవిధ్యతను చూపించాడు.
ఆమిర్ కు జోడీగా నటించిన కరీనా కపూర్ కూడా ఈసినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. ఆమీర్-కరీనా కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. రూప పాత్రకు పూర్తి న్యాయం చేసింది కరీనా. లాల్ చిన్నప్పటి క్రష్ గా, లవ్ ఇంకా వైఫ్ గా లాల్ తో పాటు తను కూడా డిఫరెంట్ షేడ్స్ ను చాలా బాగా చూపించగలిగింది.
ఇక మొదటి నుండి ఈసినిమాకు మంచి బజ్ రావడంలో మెయిన్ గా మరో కారణం నాగచైతన్య కూడా. ఎన్నో బాలీవుడ్ అవకాశాలు వచ్చినా కూడా చైతు అవేమీ పట్టించుకోకుండా ఈసినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఎంట్రీ ఇచ్చాడు. ఇక తను నమ్మినట్టే తన పాత్రకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. బాలరాజు పాత్రలో నాగచైతన్య అందరినీ ఆకట్టుకుంటున్నాడు. తన పాత్ర నిడివి 30 నిమిషాలే అయినా కూడా స్పెషల్ ఇంపాక్ట్ ను అయితే క్రియేట్ చేయగలిగాడు. ఖచ్చితంగా ఈసినిమాలో కొత్త చైతు ను చూడొచ్చు ప్రేక్షకులు. తన లుక్స్, క్యారెక్టరైజేషన్ అన్నీ ప్రేక్షకులకు కొత్తగానే కనిపిస్తాయి.
ఇది రీమేక్ సినిమా కాబట్టి కథ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే మన ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఎలా తీశాడు అన్నది ముఖ్యం. ఆవిషయంలో డైరెక్టర్ అద్వైత్ విజయం సాధించాడనే చెప్పొచ్చు. ఆర్మీ నేపథ్యంలో వచ్చిన సినిమా అయినప్పటికీ ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టనివ్వకుండా కథను ముందుకు నడిపించాడు. ముఖ్యంగా అతుల్ కులకర్ణి ఇక్కడ నేటివిటీకి తగినట్టుగా.. మాతృకను చెడగొట్టకుండా మన ఆడియన్స్ కు నచ్చేలా కొన్ని మార్పులు చేశారు. భావోద్వేగాలతో ప్రేక్షకులను కట్టిపడేయడంలో విజయం సాధించారు.
ఇక టెక్నికల్ వ్యాల్యూస్ కూడా ఈసినిమాకు తగినట్టుగా ఉన్నాయి. తన సొంత ప్రొడక్షన్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగమైంది కాబట్టి ఎక్కడా రాజీపడకుండా సినిమాను తెరకెక్కించారు. ప్రీతమ్ సంగీతం కూడా ఆకట్టుకుంటుంది.
ఓవరాల్ గా చెప్పాలంటే లాల్ సింగ్ చద్దా ఒక ఎమోషనల్ జర్నీ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరూ ఈసినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: