శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో“#RC15” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ లో అంజలి , జయరామ్ , శ్రీకాంత్ , సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు .”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. #RC15 ” మూవీ లో 1200 ఫైటర్స్ తో హీరో రామ్ చరణ్ పాల్గొనే యాక్షన్ సీన్ , 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు, డాన్సర్ లతో రామ్ చరణ్ , కియారా అద్వానీ పాల్గొనే సాంగ్ #RC15” మూవీకి హైలైట్ కానున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
2డి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ముత్తయ్య దర్శకత్వంలో కార్తీ , అదితి శంకర్ జంటగా “విరుమాన్” తమిళ మూవీ ఆగస్టు 31న రిలీజ్ కానుంది. ప్రముఖ దర్శకుడు శంకర్ ఎస్ తనయ అదితి శంకర్ “విరుమాన్” మూవీతో కోలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు. మధురై లో జరిగిన “విరుమాన్” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో సూర్య దర్శకుడు శంకర్ పై ప్రశంసలు కురిపించారు.
30 సంవత్సరాలుగా దర్శకుడు శంకర్ అద్భుతమైన మూవీస్ తెరకెక్కిస్తున్నారనీ , పాన్ ఇండియా మూవీస్ ను తమిళ ఇండస్ట్రీ కి పరిచయం చేసిన ఘనత ఆయనదే ననీ , రామ్ చరణ్ హీరోగా దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న “#RC15” మూవీ కై దేశం మొత్తం ఎదురుచూస్తోందనీ సూర్య చెప్పారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: