సత్యదేవ్ ‘కృష్ణమ్మ’ టీజర్ రిలీజ్

Krishnamma Movie Teaser Out Now,Krishnamma Movie Teaser Out Now: Satya Dev Shines In Intense And Raw Film,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Krishnamma,Krishnamma Movie,Krishnamma Telugu Movie,Krishnamma Movie Teaser,Krishnamma Telugu Movie Teaser,Satya Dev,Hero Satya Dev Krishnamma Movie Teaser,Krishnamma Movie Teaser Released, Satya Dev Krishnamma Movie Teaser Released,Satya Dev Upcoming Movie Krishnamma,Satya Dev New Movie Krishnamma Teaser Out Now,Satya Dev latest Movie Updates,Satya Dev Upcoming Movies Updates, Sai Dharam Tej,Hero Sai Dharam Tej,Sai Dharam Tej Launced Krishnamma Movie Teaser

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన పాత్రల ద్వారా నటన ద్వారా టాలెంటెడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్. మొదట హీరో ఫ్రెండ్ పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసినా ఆతరువాత పలు సినిమాల్లో పలు కీలక పాత్రల్లో నటించి.. ఆ తరువాత హీరోగా విభిన్నమైన పాత్రలు చేసి ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. రీసెంట్ గానే గాడ్సే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సత్యదేవ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో కృష్ణమ్మ సినిమా కూడా ఒకటి. వీవీ గోపాల కృష్ణ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా కృష్ణమ్మ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక టీజర్ తో ఈసినిమా ఫుల్ ఇంటెన్స్ గా ఉండబోతుందని అర్థమవుతుంది. ఇక సత్యదేవ్ ఫుల్ రఫ్ అండ్ రస్టిక్ పాత్రలో కనిపిస్తున్నాడు. ‘ఈ కృష్ణ‌మ్మ‌లాగే మేము ఎప్పుడు పుట్టామో ఎక్క‌డ పుట్టామో ఎవ‌రికీ తెలియ‌దు’ అన్న పవర్ ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంటుంది. ముగ్గురు స్నేహితులు, ఓ విల‌న్‌కి మ‌ధ్య జ‌రిగే సంఘ‌ర్ష‌ణే కృష్ణ‌మ్మ సినిమా. ఓ చిన్న ఘ‌ట‌న వారి ముగ్గురి జీవితాల‌ను ఎలా వారి జీవితాల్లో ఎలాంటి మ‌లుపు తిప్పింద‌నేదే సినిమా. కాల భైర‌వ బ్యాగ్రౌండ్ స్కోర్‌, టీజ‌ర్‌లో చూపించిన స‌త్య‌దేవ్ ఆవేశం సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను మ‌రింతగా పెంచాయి.

ఇంకా ఈసినిమాలో లక్ష్మణ్, కృష్ణ, అథిరా రాజ్, అర్చన, నంద గోపాల్, రఘు కుంచె, తారక్, సత్యం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాలబైరవ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాని సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 7 =