దిల్ రాజు, అనిల్ రావిపూడి గార్లకు థాంక్స్ – సాయి కుమార్

Krishna From Brindavanam Launch Event Saikumar Thanks To Dil Raju and Anil Ravipudi

లవ్ లీ యంగ్ హీరో ఆది సాయికుమార్ మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘చుట్టలబ్బాయ్‌’ అంటూ దర్శకుడు వీరభద్రమ్ చౌదరితో మంచి చిత్రాన్ని చేసిన ఆది సాయి కుమార్ మళ్లీ విలేజ్ డ్రామా, ఫ్యామిలీ, లవ్, కామెడీ, ఫీల్ గుడ్ ఎమోషన్ ఇలా అన్ని అంశాలతో సినిమాను చేస్తున్నారు. ఈ మూవీని లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తూము నరసింహా, జామి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో చిత్ర పూజా కార్యక్రమాలు గురువారం నాడు కాకతీయ హిల్స్‌లోని వెంకటేశ్వరుడి సన్నిధిలో ఘనంగా జరిగాయి. పూజా కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ సాయి కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముహూర్తపు షాట్‌కు దిల్ రాజు గారు క్లాప్ కొట్టగా.. అనిల్ రావిపూడి గారు దర్శకత్వం వహించారు. ఇక స్క్రిప్ట్ అందజేస్తూ కెమెరాను సాయి కుమార్ గారు స్విచ్ ఆన్ చేశారు.

ఈ సందర్భంగా నటుడు సాయికుమార్ మాట్లాడుతూ.. “దిల్ రాజు గారు, అనిల్ రావిపూడి గారు ఎంత బిజీగా ఉన్నా అడిగిన వెంటనే వచ్చినందుకు థాంక్స్. వీరభద్రమ్ గారికి ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఇష్టం. మేం చేసిన చుట్టలబ్బాయ్ బాగా ఆడింది. ఆయన కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాలను తీస్తుంటారు. కృష్ణ ఫ్రమ్ బృందావనం కూడా ఫ్యామిలీతో చూడదగ్గ చిత్రంగా ఉంటుంది. ఆదికి అనూప్ రూబెన్స్ ఎప్పుడూ కూడా బెస్ట్ ఆల్బమ్స్ ఇస్తూనే వచ్చారు” అని తెలిపారు.

ఇంకా ఆయన ఇలా అన్నారు.. “ఈ సినిమాలోనూ మంచి పాటలు ఉండబోతున్నాయి. ఎంతో ప్యాషన్ ఉన్న నిర్మాతలు మంచి కథతో చేస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు. కాగా ఈ చిత్రంలో మురళీధర్ గౌడ్, 30 ఇయర్స్ పృధ్వీ, రఘుబాబు, అవినాష్, రచ్చ రవి, అశ్విని, శ్రీదేవి, అలేఖ్య, స్నేహ, పద్మ, గిరిధర్, గోవర్ధన్, మాస్టర్ రిత్విక్, వెంకట్ నారాయణ, గురురాజ్ తదితరులు నటిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 19 =