బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. భారీ ఫాంటసీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు అయాన్ ముఖర్జీ. భగవంతుడు, దుష్ట శక్తులకు మధ్య జరిగే యుద్ధమే ‘బ్రహ్మాస్త్రం’ కథ అని అర్థమవుతుంది. రణబీర్ కపూర్, అలియా భట్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ బడ్జెట్, హాలీవుడ్ రేంజ్ విజువల్స్, ఈసినిమా కథ అన్నీ బ్రహ్మాస్త్రపై అంచనాలు పెంచేసింది. ఇక ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈసినిమా నుండి ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయగా.. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా నుండి మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈసినిమా నుండి కుంకుమల అనే పాటను రిలీజ్ చేశారు మేకర్స్. శ్రీరామ్ పాడిన ఈపాటకు ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే. ఇక తాజాగా మరో సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. దేవ దేవ అనే సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. దీనిలో భాగంగానే నేడు ఈపాట టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈపాట కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకునేలా కనిపిస్తుంది. ఇక ఫుల్ సాంగ్ ను ఆగష్ట్ 8వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.
ॐ देवा देवा
ॐ देवा देवा
नमहTeaser out now – https://t.co/ocRxc3eBkD
Song out on August 8th#Brahmastra
— BRAHMĀSTRA (@BrahmastraFilm) August 4, 2022
కాగా సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈసినిమాలో రణ్‌బీర్‌కపూర్ శివ పాత్రలో నటిస్తుండగా అలియా ఇషా పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, అలానే నాగర్జున, మౌనిరాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను మూడు పార్టులుగా ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈసినిమాకు ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























