‘కార్తికేయ2’ ప్రమోషన్స్ పై అనుపమ క్లారిటీ..!

Anupama Clarifies about not being part of Karthikeya 2 Promotions, Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Telugu Movie Updates, Karthikeya 2 Promotions, Karthikeya 2 Movie Promotions, Anupama abou Karthikeya 2 Promotions, Hero Nikhil and Anupama Parameshwaran, Karthikeya 2, Karthikeya 2 latest News, Karthikeya 2 Movie, Karthikeya 2 Movie Updates, Karthikeya 2 Telugu Movie, Karthikeya 2 Telugu Movie Latest Updates, Karthikeya 2 Upcoming Movie Of Nikhil Siddharth Nikhil and Anupama Parameshwaran Upcoming Movie Karthikeya 2, Nikhil Siddharth

చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న సినిమా కార్తికేయ2. ఈసినిమా సూపర్ హిట్ అయిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. దీంతో ఈసినిమాపై కూడా భారీ అంచనాలు పెరిగాయి. అయితే కార్తికేయ సినిమాను సుబ్రహ్మణ్యస్వామి ఆలయం నేపథ్యంలో రూపొందించగా. ఈసీక్వెల్ ద్వాపరయుగానికి సంబంధించిన ఒక రహస్యం నేపథ్యంలో తెరకెక్కించినట్టు అర్థమవుతుంది. ప్రస్తుతం ఈసినిమా అన్ని పనులు ముగించుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. ఆగష్ట్ 12వ తేదిన ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. అయితే ఈసినిమా ప్రమోషన్స్ లో అనుపమ కనిపంచకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక దీనిపై అనుపమ తొందరగానే స్పందించి క్లారిటీ ఇచ్చింది. తన ఇన్స్టా వేదికగా ఒక పోస్టే చేసింది. అందులో అనుపమ నేను కార్తికేయ 2 ప్రమోషన్స్ లో ఎందుకు పాల్గొనట్లేదో క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను.. నేను మరో రెండు సినిమాలు చేస్తున్నాను ఆసినిమాల షూటింగ్ కోసం రాత్రి, పగలు పనిచేస్తున్నాను.. ఈ డేట్స్ ఎప్పుడో బుక్ అయినవే.. కార్తికేయ2 సినిమా రిలీజ్ డేట్ లో చాలా మార్పులు రావడంతో లేట్ అవ్వడం వల్ల ఇప్పుడు ప్రమోషన్స్ లో పాల్గొనడానికి కాస్త కష్టంగా ఉంది.. మీరందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను.. ఇక ఈసినిమాకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టిన నా చిత్రయూనిట్.. ముఖ్యంగా నిఖిల్.. చాలా ఎఫర్ట్స్ పెట్టారు.. అందరికీ లాట్స్ ఆఫ్ లవ్ అంటూ పోస్ట్ లో పేర్కొంది.

ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుండగా… ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటించనున్నాడు. కాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here