హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న సినిమా సీతారామం. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఆగష్ట్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. ఈసినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఈసినిమా ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, టీజర్ ఆకట్టుకోగా రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా అంచనాలను పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమాకు ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేసిన సునీల్ బాబు కూడా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు. ఇక ఈసినిమా షూటింగ్ విషయంలో ఎన్నో ఛాలెంజ్ లు ఎదుర్కోవాల్సి వచ్చిందని.. ఎన్నో విషయాలు రీక్రియేట్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. మొదట ఈసినిమా కథ గురించి హను రాఘవపూడి గారు చెప్పినప్పుడే ఈ కథతో ఆర్ట్ వర్క్ కూడా సింక్ అవ్వాలని.. అప్పటి కాలానికి తగినట్టుగా డిజైనింగ్ ఉండాలని అర్థమైంది. అంతేకాదు హను రాఘవపూడికి కూడా ఏం కావాలో క్లారిటీ ఉంది. ఈసినిమా లోకేషన్స్ కోసం శ్రీనగర్ ఇంకా ఓల్డ్ కాశ్మీర్ వ్యాలీ లో దాదాపు ఆరు నెలలు పాటు రెక్కీ చేశాం.. మీరు చూసే లొకేషన్స్ కశ్మీర్ లో సెట్ వేసినవే.. ఈసినిమాలోని వాడిన ప్రాపర్టీస్ స్టాచ్యూస్, వెపన్స్, టెన్ట్ తో పలు ప్రాపర్టీస్ హైద్రాబాద్ లో చేసినవే. ఇక్కడకు ట్రక్కుల ద్వారా తీసుకొచ్చాం. దీంతో టైమ్ తో పాటు డబ్బు పరంగా కూడా చాలా సేవ్ అయ్యాయి. కశ్మీర్ లోని క్లైమెట్ వల్ల సెట్స్ వేయడం చాలా కష్టం.. ఒకపక్క సినిమా షూటింగ్ జరుగుతునే మరోపక్క సెట్స్ పై వర్క్ చేసేవాళ్లం. గేట్స్, వాచ్ టవర్స్, చెక్ పోస్ట్స్ అంతేకాదు ఆర్సీ వెహికల్స్ కూాడా రీక్రియేట్ చేసినవే.
ఈసినిమా కోసం దాదాపు ఎనిమిది సెట్స్ వేశాం.. అందులో మద్రాస్ ఆర్మీ రెజిమెంట్ బరాక్స్ ఇంకా కంటోన్మెంట్ సెట్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. వాటికోసం నిజానికి ఎప్పటినుండో వాడని సిల్క్ ఫ్యాక్టరీని వాడటం జరిగింది.. దాదాపు 140 మంది వర్కర్లు 30 రోజుల పాటు పనిచేసి అక్కడ సెట్ వేశారు. ఇంకా ఈసినిమాలో హరిటేజ్ లొకేషన్స్ లో కూడా తీశాం.. అయితే ముందు అక్కడ పర్మిషన్ దొరకలేదు.. అయితే నిర్మాత స్వప్న దత్ గారు ఢిల్లీ వెళ్లి అక్కడ అధికారులతో మాట్లాడి పర్మిషన్ తీసుకున్నారు అని తెలిపారు. అంతేకాదు తను కొన్ని ప్రాపర్టీస్ ఉపయోగించడానకిి చాలా రీసెర్చ్ కూడా చేశారు. స్టాంప్స్, ఎన్విలప్స్, ఇంక్ తో లెటర్స్ రాయడం, ఆర్ట్ వర్క్ ఇంకా కరెనీ ఇలా చాలా విషయాల గురించి రీసెర్చ్ చేశారు అని తెలిపారు సునీల్ బాబు.
ఇంకా ఈసినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రష్మిక మందన్నా కశ్మీరీ యువతి అఫ్రీన్ పాత్రలో సెకండ్ ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తుంది. ఇంకా సుమంత్, భూమికా చావ్లా, తరుణ్ భాస్కర్, ప్రకాశ్‌రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ పతాకంపై అశ్విని దత్, ప్రియాంక్ దత్ నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు పీఎస్ వినోద్ సినిమాట్రోగాఫర్ గా పనిచేస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.