పోల్ గేమ్ :ఈ నెల (ఆగస్ట్ ) లో రిలీజ్ కానున్న ఏ మూవీ కి మీ ఓటు ?

For Which Movie Release You Are Eagerly Waiting?, Ananya Panday, Ananya Panday Latest Movie, Ananya Panday Movies, Ananya Panday New Movie, August 2022 Telugu Movie Releases, BIMBISĀRA, Bimbisara Movie, Bimbisara Movie Latest Update, Bimbisara Movie Release Date, Bimbisara Telugu Movie, Dulquer Salmaan, Kalyan Ram Bimbisara, Kalyan Ram Bimbisara Movie, Kalyan Ram Latest Movie, Kalyan Ram Latest Movie Update, Kalyan Ram Latest News, Kalyan Ram Latest Project, Liger, Liger Movie Release Date, Sita Ramam, Sita Ramam Movie, Sita Ramam Movie Latest Updates, Sita Ramam Movie Release Date, Sita Ramam Telugu movie, Telugu Film News 2022, Telugu Filmnagar, Telugu Movie Updates, Telugu Movies For Release In August 2022, Tollywood Latest News, Tollywood Movie Updates, Tollywood Movies Releasing In August 2022, Upcoming Telugu Movies Release in August 2022, Macherla Niyojakavargam, Macherla Niyojakavargam Movie, Macherla Niyojakavargam Movie Updates

సీతారామం: వైజయంతీ మూవీస్ స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన “సీతారామం ” మూవీ ఆగస్ట్ 5 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “సీతారామం” మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో గ్రాండ్‌గా విడుద‌ల కానుంది.”సీతారామం” మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బింబిసార : ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్‌ రామ్‌ హీరోగా బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన “బింబిసార”మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ కానుంది. హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన “బింబిసార”మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.హీరో కళ్యాణ్ రామ్ రెండు విభిన్నమైన పాత్రలలో నటించిన , హై టెక్నికల్ వాల్యూస్, భారీ బడ్జెట్ తో తెరకెక్కిన “బింబిసార”మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ కు , యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ్ అయిన సెకండ్ ట్రైలర్ కు అద్భుత స్పందన లభిస్తుంది.

మాచర్ల నియోజకవర్గం : రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్ , శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్స్ పై ఎడిటర్ శేఖర్ దర్శకత్వంలో నితిన్ ,బ్లాక్ బస్టర్ “ఉప్పెన”మూవీ ఫేమ్ కృతి శెట్టి జంటగా సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న పొలిటికల్‌ థ్రిల్లర్‌ “మాచర్ల నియోజకవర్గం” మూవీ ఆగస్ట్ 12వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో క్యాథరీన్ మరో కథానాయిక. ప్రభుత్వ ఆఫీసర్ గా నితిన్ నటిస్తున్న ఈ మూవీలో విలన్ గా సముద్ర ఖని నటిస్తున్నారు. హీరోయిన్ అంజలి ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మహతి సాగర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “మాచర్ల నియోజకవర్గం” మూవీ పోస్ట‌ర్‌లు, గ్లింప్స్, సాంగ్ ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకున్నాయి.

కార్తికేయ 2 : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ “కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన “కార్తికేయ 2 “మూవీ ఆగస్ట్ 12 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. స్వాతి రెడ్డి , రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.హీరో నిఖిల్ సినీ కెరీర్ లో భారీ బడ్జెట్ , భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కిన“కార్తికేయ 2 “ మూవీ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ , క్యారెక్టర్స్ ను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “కార్తికేయ 2 “మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై హైప్ ను క్రియేట్ చేసింది.

లైగర్ : పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ “లైగర్” ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ , మకరంద దేశ్ పాండే , రమ్యకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. తనీష్ బాగ్చి సంగీతం అందించగా , మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ మూవీ కై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు.”లైగర్” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు, వీడియోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.“లైగర్” మూవీ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ సింగిల్ , ట్రైలర్ , యాటిట్యూడ్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

పోల్ గేమ్ :ఈ నెల (ఆగస్ట్ ) లో రిలీజ్ కానున్న ఏ మూవీ కి మీ ఓటు ?

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 18 =