క్రాక్ సినిమాతో మంచి హిట్ ను అందుకొని ఫామ్ లోకి వచ్చాడు మాస్ మహారాజా రవితేజ. ఈసినిమా తరువాత ఇటీవలే ఖిలాడి సినిమాను రిలీజ్ చేశాడు.. అయితే ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా రవితేజకు నిరాశనే మిగిల్చింది. అయినా కూడా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రవితేజ ఖాతాలో ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి. అందులో త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ. జూలై 29 వ తేదీన గ్రాండ్ గా విడుదల అవుతుంది ఈసినిమా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈనేపథ్యంలో చిత్రయూనిట్ వరుస అప్ డేట్లు ఇస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్, ట్రైలర్ మరియు కొన్ని పాటలను విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా భారీ ఎత్తులో నిర్వహించింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి మాస్ నోటీస్ పేరుతో ఓ వీడియోను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ వీడియోలో రవి తేజ మళ్ళీ దుమ్ములేపేశాడు. ట్రైలర్ న్ మించి పోయేలా ఈ వీడియో ఉంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: