సూపర్ హిట్ “భీమ్లానాయక్ ” మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ ప్రస్తుతం కళ్యాణ్ రామ్ “బింబిసార “, ధనుష్ “సార్” మూవీస్ లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా క్రీస్తుపూర్వం 500 వ శతాబ్ద సమయంలో మగధదేశ రాజు భట్టియా కుమారుడైన బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన “బింబిసార”మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ కానుంది. హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన “బింబిసార”మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన విజువల్స్ తో గ్రాండియర్ గా రూపొందిన “బింబిసార” మూవీ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని యూట్యూబ్ లో భారీ వ్యూస్ తో దూసుకుపోతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“బింబిసార”మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సంయుక్త మీడియా తో సమావేశమయ్యారు. సంయుక్త మాట్లాడుతూ .. తనకు సోషియో ఫాంటసీ సినిమాలంటే చాలా ఇష్టమనీ , పీరియాడిక్ సినిమాలన్నా ప్రత్యేకమైన ఆసక్తి.అనీ , ‘బాహుబలి 2’ ఫస్ట్ డే, ఫస్ట్ షో.. ఒక్కదాన్నే థియేటర్‌కి వెళ్లి మరీ చూశాననీ , అలాంటి జోనర్‌లో రూపొందిన “బింబిసార”మూవీ లో తనకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తాననీ , పైగా ఎన్టీఆర్ ఆర్ట్స్ చాలా ప్రతిష్ఠాత్మక సంస్థలో తొలి అడుగుల్లోనే ఇంత గొప్ప ఛాన్స్ రావడం ఆనందంగా ఉందనీ ,తెలుగు, మలయాళ సినిమాల్లో చాలా వైవిధ్యం కనిపిస్తోందనీ , అక్కడ సినిమా అంటే నలభై రోజుల్లో పూర్తి చేస్తారనీ , ఇక్కడ ఎక్కువ సమయం కేటాయిస్తారనీ , మలయాళంలో చాలా సహజమైన లొకేషన్లలో సినిమా తీస్తారనీ , .ఇక్కడ భారీ సెట్లు ఉంటాయనీ , సినిమాని ప్రేక్షకులు ఆదరించే విషయంలోనూ చాలా తేడా ఉందనీ , .తెలుగు ప్రేక్షకుల ప్రేమ అమితమైనది. థియేటర్లో ఓ మాస్ సీన్ వచ్చిందంటే రచ్చ రచ్చ చేస్తారు. అంత ఉత్సాహం, హంగామా తానెక్కడా చూడలేదనీ ,అందుకే ఇక మీదట.. కేవలం ప్రేక్షకుల్ని ఉల్లాసపరిచే సినిమాలు కూడా కొన్ని చేయాలనే నిర్ణయం తీసుకొన్నాననీ , తనకు నటన అంటే ప్రాణం , సినిమా అంటే పిచ్చి అనీ చెప్పారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: