బ్లాక్ బస్టర్ “ఉప్పెన“మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృతి శెట్టి, ఆ మూవీ లో తన అందం అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “ఉప్పెన “, “శ్యామ్ సింగ రాయ్” , “బంగార్రాజు ” మూవీస్ తో కృతి శెట్టి హ్యాట్రిక్ సాధించారు.సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ కృతి శెట్టి ప్రస్తుతం “ది వారియర్ “, “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”,“మాచర్ల నియోజకవర్గం” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. నాగచైతన్య హీరోగా తెరకెక్కనున్న “#NC 22” మూవీ లో కథానాయికగా కృతి నటిస్తున్నారు. బాలా దర్శకత్వంలో సూర్య , అరుణ్ మాధేశ్వరన్ దర్శకత్వంలో హీరో ధనుష్ నటించే తమిళ మూవీస్ లో కృతి కథానాయికగా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ కృతిశెట్టి ఇప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. యు జి ఎమ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై జితిన్ లాల్ దర్శకత్వం లో టోవినో థామస్ హీరోగా పీరియాడికల్ డ్రామా “అజయంతే ర్యాండమ్ మోషణం “మలయాళ మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ లో టోవినో థామస్ కు జోడీగా కృతి శెట్టి ఎంపిక అయ్యారని సమాచారం.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: