పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. మొఘలాయిల కాలం నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమాకు మాత్రం బ్రేకులు పడుతూనే ఉన్నాయి. ఈసినిమా కంటే వెనుక మొదలైన వకీల్ సాబ్ సినిమానే ముందు షూటింగ్ ను పూర్తిచేసుకుంది.. రిలీజ్ కూడా అయి చాలా కాలమైంది. కానీ ఈసినిమాకు మాత్రం ఇంకా విముక్తి కలగలేదు. ఈసినిమాను రీస్టార్ట్ చేయడమే చాలా లేటుగా చేశారు. ఫైనల్ గా ఇటీవలే మొదలుపెట్టారు ఇక మొత్తం షూటింగ్ కంప్లీట్ చేస్తారులే అనుకుంటే మళ్లీ గ్యాప్ ఇచ్చారు. మరోవైపు పవన్ కూడా రాజకీయాలతో బిజీ అవ్వడం ఈసినిమా షూటింగ్ కు మైనస్ అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజా సమాచారం ప్రకారం చిత్రయూనిట్ ఈసినిమా షూటింగ్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆగష్ట్ సెకండ్ వీక్ నుండి కొత్త షెడ్యూల్ ను ప్రారంభించి ఈ షెడ్యూల్ లో మ్యాగ్జిమమ్ పవన్ కు సంబంధించిన పోర్షన్స్ ను పూర్తి చేయాలని క్రిష్ ప్లాన్ చేస్తున్నాడట. ఒక పాటతో పాటు పవన్ క్యారెక్టర్‌కి సంబంధించిన సీన్స్ మొత్తం ఈ షెడ్యూల్లోనే పూర్తి చేయాలని.. ఆ తర్వాత మిగతా వారి సీన్స్‌ని తెరకెక్కించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి ముందు పవన్ సన్నివేశాలు తీసి తరువాత ఇతర సన్నివేశాలు తీస్తే కానీ ఈసినిమాను అనుకున్న టైము కు పూర్తి చేయగలరు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..
కాగా ఈసినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ఇంకా అర్జున్ రాంపాల్ కూడా ఓ కీలక పాత్రల్లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ వి.ఎస్. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: