ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ అయ్యే చిత్రాలు

List Of Movies Releasing This Week,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Movie Releases This week,This Week Movie Releases,Telugu Movie Release,This Week Movies Updates,Vikrant Rona, Vikrant Rona Movie,Vikrant Rona Telugu Movie,Vikrant Rona Release This Week,Vikrant Rona Movie Releasing on 29th July, Kiccha Sudeep,Hero Kiccha Sudeep,Kiccha Sudeep Vikrant Rona Movie,Kiccha Sudeep Vikrant Rona Movie Releasing This week on 29th July, The Legend,The Legend Movie,The Legend Telugu Movie,Arun Saravanan The Legend Movie,The Legend Arun Saravanan Movie Releaseing on 29th July, Ramarao on Duty,Ramarao on Duty Movie,Ramarao on Duty Telugu Movie,Ramarao on Duty Movie Releasing on 29th July, Ramarao on Duty Telugu Movie,Ravi Teja Ramarao on Duty Movie,Ek Villain Returns,Ek Villain Returns Movie,Ek Villain Returns Hindi Movie, Ek Villain Returns Movie Releasing on 29th July This Week,This weekend Movie Updates,This Weekend Movie Releases,John Abraham Ek Villain Returns Movie Releasing on 29th July

విక్రాంత్ రోణ : కిచ్చా క్రియేషన్స్ , షాలిని ఆర్ట్స్ , ఇన్వెనియో ఫిల్మ్స్ ఇండియా బ్యానర్స్ పై అనూప్ భండారి దర్శకత్వంలో సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ ” విక్రాంత్ రోణ”కన్నడ మూవీ జులై 28 వ తేదీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది. నీతా అశోక్ , జాక్వెలెన్ ఫెర్నాండెజ్ కథానాయికలు. నిరూప్ భండారి, రవిశంకర్ గౌడ ముఖ్య పాత్రలలో నటించారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ది లెజెండ్: శరవణన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై జె . డి . జెర్రీ దర్శకత్వంలో అరుణ్ శరవణన్ , ఊర్వశి రౌటేలా జంటగా తెరకెక్కిన “ది లెజెండ్”తమిళ మూవీ తమిళ , తెలుగు భాషలలో జూలై 28 వ తేదీ రిలీజ్ కానుంది. ప్రభు , వివేక్ , నాజర్ , సుమన్ ముఖ్యపాత్రలలో నటించిన ఈ మూవీ లో రాయ్ లక్ష్మీ , యషిక ఆనంద్ స్పెషల్ సాంగ్స్ లో నటించారు. హేరీస్ జయరాజ్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

రామారావు ఆన్ డ్యూటీ : శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ , ఆర్ టి టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ జులై 29 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. ఈ మూవీ లో “కమిట్ మెంట్ “మూవీ ఫేమ్ అన్వేషి జైన్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. కామెడీ హీరో వేణు ఒక కీలక పాత్రలో నటించి టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తున్నారు. సామ్ సి ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఏక్ విలన్ రిటర్న్స్ : టి -సిరీస్ , బాలాజీ మోషన్ పిక్చర్స్ బ్యానర్స్ పై మోహిత్ సూరి దర్శకత్వంలో జాన్ అబ్రహాం , అర్జున్ కపూర్ , దిశా పటానీ , తారా సుతారియా ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “ఏక్ విలన్ రిటర్న్స్ “హిందీ మూవీ జూలై 29 వ తేదీ రిలీజ్ కానుంది. జె . డి. చక్రవర్తి , రితేష్ దేశ్ ముఖ్ ముఖ్య పాత్రలలో నటించారు. అంకిత్ తివారి , తనీష్ బాగ్చి , కౌశిక్మ్ -గుడ్డు సంగీతం అందించగా రాజు సింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =