బాబాయి తోనే నా సినీ జర్నీ మొదలైంది..!

Kalyan Ram Reveals Interesting Facts About Balakrishna,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Kalyan Ram,Hero Kalyan Ram,Nandamuri Kalyan Ram,Kalyan Ram About Balakrishna,Kalyan Ram Interesting Facts About Balakrishna,Kalyan Ram Facts Nandamuri Balakrishna, Kalyan Ram Film Journey Started with Balakrishna,Kalyan Ram upcoming Movies,Kalyan Ram New Movie Updates,Kalyan Ram Upcoming Movie Bimbisara,Kalyan Ram New Movie Bimbisara latest Updates, Kalyan Ram Bimibisara Movie Trailer Released,Kalyan Ram Cine Journey Started with Balakrishna,Kalyan Ram Debut Movie As a Child Artist in Bala Gopaludu Movie,Kalyan Ram As A Hero Debut Film Toli Choopulone

ఇప్పటివరకూ కమర్షియల్ సినిమాలు, యాక్షన్ ఎంటర్ టైనర్ లతో ప్రేక్షకులను అలరించిన కళ్యాణ్ రామ్ ఇప్పుడు మొదటిసారి కెరీర్ లోనే డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు. బింబిసార అనే సోషియో ఫాంటసీ సినిమాతో వస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేయగా అవి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.. ఈనెల 29వ తేదీన ఈసినిమా ప్రీరిలీజ్ ను నిర్వహించనున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా రానున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే చిత్రయూనిట్ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యలో పాల్గొన్న కళ్యాణ్ రామ్ తన సినీ ఎంట్రీ గురించి మాట్లాడుతూ… నేను సెవెంత్ క్లాస్ చదువుతున్న టైమ్ లో ఒకసారి బాలయ్య బాబాయి మాఇంటికి వచ్చారు. ఆ టైమ్ లో బాబాయి ‘బాల గోపాలుడు’ సినిమా చేస్తున్నారు. అయితే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ పాత్ర ఒకటి ఉందనీ, ఆ పాత్రను నాతో చేయించాలని అనుకుంటున్నట్టుగా చెప్పారు. అలా ‘బాల గోపాలుడు’ సినిమాతో నటుడిగా నా జర్నీ మొదలైంది. ‘తొలి చూపులోనే’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాను. ‘అతనొక్కడే’ సినిమాతో సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకుని, ‘ఓం’ వంటి ప్రయోగాలు చేశాను. ఆ సినిమా చాలా నిరాశపరిచింది. అయినా మారుతున్న ట్రెండ్ కి అనుగుణంగా ముందుకు వెళుతున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా ఈసినిమాను తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైనే నిర్మిస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఇక ఈసినిమాలో కేథ‌రిన్ థెరిసా, సంయుక్తా మీన‌న్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం, చోటా కె నాయుడు సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. ఆగష్ట్ 5వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − six =