తన సినిమాలతో, నటనతో తెలుగులో కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్. ఇన్ని రోజులు డబ్బింగ్ సినిమాలతో అలరించిన విజయ్ ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగు సినిమాతో రాబోతున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. తెలుగ, తమిళ్ రెండు భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా టైటిల్ ను అలానే ఫస్ట్ లుక్ తో పాటు పలు పోస్టర్లు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈసినిమాలో విజయ్ పాత్రకు సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాలో విజయ్ ఫుడ్ యాప్ డిజైనర్ గా కనిపిస్తాడట.అంతేకాదు ఫ్లాష్ బ్యాక్ లో కాలేజ్ కు వెళ్లే విద్యార్థిగా కూడా విజయ్ కనిపించ నున్నట్టు తెలుస్తుంది.
ఈసినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, శ్యామ్, ప్రకాశ్ రాజ్, సంగీత, జయసుధ, ప్రభు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈసినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: