మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై బాగానే అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంది.. గోపీచంద్ సీటీమార్ తరువాత మరో హిట్ ను అందుకున్నాడో?లేదో? తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. గోపీచంద్, రాశీఖన్నా, సత్యరాజ్, రావు రమేష్, వరలక్ష్మీ శరత్ కుమార్, అజయ్ ఘోష్, సప్తగిరి, ప్రవీణ్ తదితరులు
డైరెక్టర్.. మారుతి
బ్యానర్స్.. గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్
నిర్మాతలు.. బన్నీ వాసు
సంగీతం..జకేస్ బీజాయ్
సినిమాటోగ్రఫి..కరం చావ్లా
కథ
సూర్య నారాయణ (సత్య రాజ్) న్యాయమూర్తిగా పనిచేస్తుంటాడు. అయితే ఓ అమ్మాయికి న్యాయం చేయలేకపోయానని బాధతో వృత్తిని వదిలేస్తాడు. డబ్బున్న వారికే న్యాయం అందుతోందంటూ వివేక్ (రావు రమేష్) కేసులో జరిగింది న్యాయం కాదు.. అన్యాయం అని తలుచుకుంటూ సూర్య నారాయణ కుమిలిపోతుంటాడు. మరోవైపు సూర్య నారాయణ కొడుకు లక్కీ (గోపీచంద్) కమర్షియల్ గా తయారవుతాడు. ప్రతి విషయంలో చాలా కమర్షియల్ గా ఉంటాడు. ఈక్రమంలో మళ్లీ వివేక్ (రావు రమేష్)కేసులో మాత్రం తండ్రీకొడుకులు ఎదురెదురుగా నిలవాల్సి వస్తుంది. మరి ఈ న్యాయపోరాటంలో ఎవరు గెలుస్తారు? అసలు లక్కీ అలా ఎందుకు మారిపోతాడు? బంధాలు బంధుత్వాలకంటే లక్కీకి డబ్బులే ఎక్కువయ్యాయా? చివరకు సూర్య నారాయణ తాను కోరుకున్న న్యాయం చేయగలుగుతాడా? అన్నదే మిగతా కథ.
విశ్లేషణ
టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ మారుతి. మారుతి సక్సెస్ రేటు కూడా ఎక్కువే. అందుకే తన నుండి సినిమా వస్తుందంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది. ముఖ్యంగా కామెడీకి ప్రేక్షకులు ఎక్కువగా కనెక్ట్ అవుతారు. ఇక ఈసినిమాలో కూడా మారుతి తమ కామెడీతో పాటు కమర్షియల్ యాంగిల్ ను కూడా చూపించాడు. న్యాయం వ్యవస్థలో ఉండే లోపాలను ఈసారి కీపాయింట్ గా తీసుకున్నాడు. కోర్టు డ్రామా నేపథ్యంలో ఎన్నో పాత్రలు చూశాం. ఇక హీరోను మొదట నెగిటివ్ యాంగిల్ లో చూపింది ఆతరువాత మంచి వాడిలా చూపించే పాత్రలు కూడా చాలా చూశాం. అవన్నీ కలిపి ఓ కామెడీ కమర్షియల్ అంశాలతో సినిమా తెరకెక్కించాడు మారుతి. ఫస్ట్ హాఫ్ లో హీరో క్యారెక్టరైజేషన్, హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్, యాక్షన్ సీక్వెన్స్‌లు చూపించాడు. సెకండ్ హాఫ్ కాస్త సీరియస్ గా తీశాడు.
అయితే గోపిచంద్ కు కామెడీ కొత్తేమీ కాదు. ఇంతకు ముందు యాక్షన్ కామెడీలుతో నటించి హిట్స్ కూడా కొట్టాడు. అదే ఈజ్ తో ఈసినిమాలో కూడా నటించాడు. గోపీచంద్‌ను ఎంతో స్టైలీష్‌గా చూపించాడు మారుతి. ముఖ్యంగాడబ్బుల్లేనిదే ఏ పని చేయను, డబ్బిస్తే అన్యాయాన్ని కూడా న్యాయంగా మార్చేసే లక్కీ పాత్రలో గోపీచంద్ అదరగొట్టేశాడు. ఈ చిత్రంలో గోపీచంద్ యాక్షన్, ఎమోషన్, కామెడీ, రొమాంటిక్ ఇలా అన్ని యాంగిల్స్‌ను చూపించాడు. ఇక రాశీఖన్నా కు కూడా మంచి ఎలివేట్ అయ్యే పాత్రే దక్కింది. లాయర్ ఝాన్సీ పాత్రలో రాశీ ఖన్నా అందరినీ నవ్విస్తుంది. తనకు తాను ఎక్కువగా ఊహించుకునే పాత్రలో రాశీ ఖన్నా అద్భుతంగా నటించింది. రాశీ ఖన్నా బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ అన్నీ కూడా ఆకట్టుకుంటాయి.
ఇక మరో ముఖ్యమైన పాత్ర రావు రమేష్ ది అని చెప్పొచ్చు. ఈ చిత్రం లో మెయిన్ విలన్ గా రావు రమేష్ ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకున్నాడు. అజయ్ ఘోష్ తో కలిసి పలు సన్నివేశాల్లో నవ్వించాడు. అతని బాడీ లాంగ్వేజ్ మరియు డైలాగ్ డెలివరీ లు సినిమాకు చాలా ప్లస్ పాయింట్స్. ఇక మిగిలి నటీనటులు సత్యరాజ్ , వైవా హర్ష, సప్తగిరి, సియా గౌతమ్ తమ పాత్రలతో ఆకట్టుకున్నారు.
ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. జేక్స్ బెజాయి సంగీతం బాగుంది, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు అని చెప్పాలి.
ఇక ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమాను పలానా జోనర్ కు మాత్రమే నచ్చుతుంది అని చెప్పలేం. అందరూ ఒకసారి చూసి ఎంజాయ్ చేసే సినిమా అని చెప్పొచ్చు. అటు కమర్షియల్ ఎలిమెంట్స్ మరోవైపు కామెడీ ఇలా అన్ని యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి అన్ని వర్గాల వారు సినిమా చూడచ్చని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: