సురేష్ ప్రొడక్షన్స్ , శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ పై వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి , సాయి పల్లవి జంటగా 90ల కాలం నాటి కొన్ని వాస్తవిక ఘటనల ఆధారంగా తెరకెక్కిన “విరాటపర్వం” మూవీ జూన్ 17 వ తేదీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ప్రియమణి , నందితా దాస్, నివేత పేతురాజ్ , సాయిచంద్ , నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.ఈమూవీ లో రానా , సాయి పల్లవి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“విరాటపర్వం” మూవీ తాజాగా ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈ రోజు( “జూలై 1 )నుండి స్ట్రీమింగ్ అవుతుంది. “విరాట పర్వం”మూవీ లో తాను చేసిన వెన్నెల పాత్ర తాను ఇప్పుడు వరకు చేసిన పాత్రల్లో ఒక మరపురాని పాత్ర అనీ, ఆ రోల్ చేసినందుకు గర్వంగా ఫీలవుతున్నాననీ , “విరాట పర్వం”మూవీ ని ఫ్యాన్స్ అందరూ చూడాలనీ సాయి పల్లవి స్పెషల్ రిక్వెస్ట్ చేస్తూ “విరాట పర్వం” సినిమాకు సంబంధించిన కొన్ని ఫొటోలను షేర్ చేస్తూ , ఈ సినిమా చేసే అవకాశం తనకు ఇచ్చిన మూవీ యూనిట్ అందరికీ థ్యాంక్స్ అంటూ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: