ఈరెండేళ్లలో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. రీసెంట్ గానే హీరో హీరోయిన్లు అయిన ఆది పినిశెట్టి-నిక్కి గర్లానీ ఇద్దరూ వివాహం చేసుకున్నారు. వీరిది ప్రేమ వివాహమే. ఇప్పుడు మరో నటి కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఆ నటి మరెవరో కాదు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన మధుశాలిని. పెద్ద హడావుడి లేకుండా మధుశాలిని పెళ్లి చేసుకుంది. వరుడు మరెవరో కాదు తమిళ నటుడు గోకుల్ ఆనంద్. ఇక ఈవిషయాన్ని మధుశాలిని కూడా తన ట్విట్టర్ ద్వారా ఫొటో షేర్ చేస్తూ అధికారికంగా తెలియచేసింది. తమ ఫొటోను షేర్ చేస్తూ ”మాకు లభించిన ప్రేమకు ధన్యవాదాలు. జీవితంలోని కొత్త అధ్యాయం కోసం ఎదురు చూస్తున్నాం. లవ్ మధు షాలిని అండ్ గోకుల్ కృతజ్ఞతతో అంటూ ట్వీట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Thank you for all the love we’ve received. We look forward to the new chapter of our lives with hope and gratitude in our hearts.
Love MADHU SHALINI & GOKUL ♥️ pic.twitter.com/6YLREAZo8L
— MADHU SHALINI (@iamMadhuShalini) June 17, 2022
ఇక వీరిద్దరిది కూడా ప్రేమ వివాహమే. గోకుల్ ఆనంద్-మధుశాలిని ప్రధాన పాత్రల్లో తమిళ్ లో పంచాక్షరం అనే సినిమా వచ్చింది. 2019 డిసెంబర్ 27న విడుదలైన ఈ చిత్రాన్ని పారడాక్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో వైరముత్తు నిర్మించారు. బాలాజీ వైరముత్తు దర్శకుడు. ఈ సినిమా సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడినట్టు తెలుస్తంది. దాదాపు మూడేళ్లు ప్రేమ ప్రయాణం కొనసాగించిన ఈజంట ఫైనల్ పెళ్లి పీటలెక్కి విహహం చేసుకున్నారు. ఇక ఈజంటకు సినీ సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.