ఇన్ స్టా గ్రామ్ లో అల్లు అర్జున్ రికార్డ్

Icon Star Allu Arjun’s New Record on Instagram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Icon Star Allu Arjun,Allu Arjun,Allu Arjun Movies,Allu Arjun In Instagram,Stylish Star Allu Arjun,Stylish Star Allu Arjun, New Record for Allu Arjun in InstaGram,Allu Arjun Record in Instagram 18.5 Million Followers,Allu Arjun 18.5 Million Followers in Instagram, Allu Arjun Creates Record in Instagram

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “పుష్ప: ది రైజ్” మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. “పుష్ప :ది రైజ్”మూవీ హిందీ వెర్షన్ కూడా ఘనవిజయం సాధించి, బాలీవుడ్ లో అల్లు అర్జున్ పై క్రేజ్ పెంచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“పుష్ప :ది రైజ్”మూవీతో దేశవ్యాప్తంగా క్రేజ్ పొందిన అల్లు అర్జున్ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ  , తన కుటుంబ సభ్యుల ఫొటోలు , వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఒక అద్భుతమైన రికార్డ్ ను క్రియేట్ చేశారు. ఇన్ స్టా గ్రామ్ లో 18.5 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ కి అల్లు అర్జున్ చేరుకున్నారు. అంతకంతకూ అల్లు అర్జున్ క్రేజ్ పెరుగుతూ వెళుతోంది. ఇదే స్పీడ్ లో అయితే టాలీవుడ్ ఫస్ట్ అండ్ ఫాస్టెస్ట్ 20 మిలియన్ ఫాలోవర్స్ కలిగిన హీరోగా అల్లు అర్జున్ రికార్డ్ క్రియేట్ చేసే అవకాశం ఉంది.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 13 =