ఎంత బ్యాక్ గ్రౌండ్ తో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా అది ఎంట్రీ వరకే అని.. వారసులకు సరైన సక్సెస్ రావాలంటే మాత్రం అది ఆడియన్స్ చేతుల్లోనే ఉంటుందని ఎంతో మంది హీరోలు నిరూపించారు. ఇక ఆ లిస్ట్ లో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి. కూడా ఉంటాడు. ఎంతోమంది హీరోలకు బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ చరిత్రలు తిరగరాసే హిట్లు ఇచ్చాడు పూరీ. ఇక ఇప్పుడు తనయుడు సక్సెస్ కోసం చూస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన ఆకాష్ పూరీ హీరోగా కాస్త తొందరగానే ఎంట్రీ ఇచ్చాడని చెప్పొచ్చు. ఆంధ్రా పోరి, మెహబూబా, ఇటీవల రొమాంటిక్ సినిమాతో వచ్చినా ఆ సినిమాలు ఏవీ పెద్దగా విజయాన్ని అందించలేకపోయాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం అయితే మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. జార్జ్ రెడ్డి చిత్రంతో మంచి గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు జీవన్ రెడ్డితో కలిసి చోర్ బజార్ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈనేపథ్యంలోనే ఈసినిమా ప్రమోషన్స్ ను మళ్లీ స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. నటసింహం బాలకృష్ణ చేతుల మీదుగా విడుదల చేశారు.ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, ‘చోర్ బజార్’ ట్రైలర్ చాలా బాగుందని, టైటిల్ కూడా ఆకట్టుకునేలా ఉందని కితాబునిచ్చారు. పూరి జగన్నాథ్ కుటుంబంతో ‘పైసా వసూల్’ సినిమా నుంచి తనకు మంచి అనుబంధం ఏర్పడిందని.. ఈ సినిమాతో ఆకాశ్ పూరీ మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నానని తెలిపారు.
Pakkaaaaaa massssss!!!
All the best Akash and entire team ..
wish u all loads of success 🤗https://t.co/hCv9SfJVGs@ActorAkashPuri @gehna_sippy @GeorgeReddyG1 @VSRajuOfficial @IVProductions_ pic.twitter.com/0RhXuyeh65— Charmme Kaur (@Charmmeofficial) June 9, 2022
కాగా లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాను వీ ప్రొడక్షన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మిస్తున్నారు. ఈసినిమాలో గెహన సిప్పీ హీరోయిన్ గా నటిస్తుండగా..ఇంకా ఈ సినిమాలో సుబ్బరాజు, పోసాని, లేడీస్ టైలర్ ఫేమ్ అర్చన కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సురేష్ బొబ్బిలి చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మరి ఈసినిమాతో అయిన ఆకాష్ మంచి హిట్ సొంతం చేసుకుంటాడేమో చూడాలి.



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: