కొత్త సినిమాలపై రూమర్లు రావడం కామన్ థింగే. పెద్ద సినిమాలకు కాస్త ఎక్కువగానే వస్తుంటాయి. ఒక్కోసారి చిత్రయూనిట్ వాటిని బ్రేక్ చేసినా మళ్లీ ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. ఇక భవదీయుడు భగత్ సింగ్ పై కూడా కొద్ది రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈసినిమా ఆగిపోయిందంటూ చాలా రోజులుగా వస్తూనే ఉన్నాయి. అయితే ఆ వార్తలపై ఇప్పటికే హరీష్ శంకర్ కూడా క్లారిటీ ఇచ్చాడు. ఈసినిమా ఆగిపోలేదని స్పష్టం చేశాడు. ఇక మరోసారి ఈసినిమాపై క్లారిటీ వచ్చేసింది. ఈసారి ఏకంగా పవనే స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో ఈసినిమాపై ఉన్న అనుమానాలు అన్నీ తొలగిపోయాయి. నాని హీరోగా నటించిన “అంటే సుందరానికీ” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఈసినిమా గురించి కూడా ప్రస్తావిస్తూ.. తమ సినిమా ఆగలేదు చేస్తున్నామని తెలిపారు. మరి ఇప్పటికైనా ఈరూమర్లకు ఫుల్ స్టాప్ పడుతుందేమో చూద్దాం..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమాతో ఆ తరువాత భీమ్లానాయక్ తో రెండు బ్లాక్ బస్టర్లను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం అయితే హరిహర వీరమల్లు సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసినిమా తరువాత హరీష్ శంకర్ తో భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేయాలి పవన్. అంతకుముందు వీరిద్దరి కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ రావడంతో ఈసినిమాపై మొదటి నుండి మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక ఈ సినిమాలో పవన్ ఒక ప్రొఫెసర్ గానే కనిపిస్తారని ఈ రోల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని ఇప్పటికే తెలిపారు.
కాగా ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ సరసన పూజా హెగ్డే నటించనుంది. ఈసినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాను కూడా సెట్స్‌పై కి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: