సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్, సయీ మంజ్రేకర్ జంటగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా “మేజర్” మూవీ 3 వ తేదీ రిలీజ్అయ్యి ప్రేక్షక , విమర్శకుల ప్రశంసలు అందుకుని సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివిశేష్ తన కెరీర్ బెస్ట్ ఫర్ఫార్మెన్స్ అందించారు. అడివి శేష్ కు జోడీగా నటించిన సయీ మంజ్రేకర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అడివి శేష్ , సయీ ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.USA లో “మేజర్”మూవీ ప్రీమియర్ షోస్ తోనే పాజిటివ్ టాక్ తో సూపర్ హిట్ గా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Thank you for the overwhelming response to #MajorTheFilm. Really proud of my entire team! We made an honest film and India has embraced it. This is just the beginning and #Major will only get bigger.. A must watch for every Indian! #IndiaLovesMajor 🇮🇳 pic.twitter.com/sXAxfTWDPL
— Mahesh Babu (@urstrulyMahesh) June 3, 2022
దేశవ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణ పొందుతున్న “మేజర్”మూవీ పై సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా స్పందించారు.”మేజర్ “మూవీకి వచ్చిన అద్భుత రెస్పాన్స్ కు థ్యాంక్స్ అనీ , మా టీమ్ గురించి గర్వం గా ఉందనీ , ఒక హానెస్ట్ ఫిల్మ్ ను రూపొందించామనీ , ఈ మూవీ ని ఇండియా మొత్తం ఆదరిస్తుందనీ , ప్రతీ భారతీయుడు చూడవలసిన సినిమా “మేజర్ ” అనీ మహేష్ బాబు ట్వీట్ చేశారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.