శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో బ్లాక్ బస్టర్ “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ గా తెరకెక్కిన “F 3” మూవీ 27 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో సోనాల్ చౌహాన్, సునీల్ కీలక పాత్రలలో నటించారు. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.హీరో వెంకటేష్ తన కామెడీ టైమింగ్‌తో మరోసారి ఈ సినిమాకే హైలెట్ గా నిలిచారు. ఫ్యామిలీ సీన్స్, మనీ ఫ్రస్ట్రేషన్ సీన్స్ ప్రేక్షకులను అలరించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“F 3” మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా వారం రోజుల్లో ఈ సినిమా 52.01 కోట్ల షేర్ రాబట్టగా, 94.5 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. 100 కోట్ల క్లబ్ దిశగా దూసుకుపోతున్న “F 3” మూవీని దర్శకుడు అనిల్ రావిపూడి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా తెరకెక్కించి ప్రేక్షకుల, సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: