అడివి శేష్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా మేజర్. ఈసినిమా 26/11 ముంబై దాడుల్లో తన ప్రాణాలను పణంగా పెట్టి ఎందరో ప్రాణాలను కాపాడిన ఎన్.ఎస్.జి కమెండో మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతుంది. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. 26/11 ముంబై ఘటన అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే కదా. అయితే ఈ బ్యాక్ డ్రాప్ లో చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా ఉన్ని కృష్ణన్ వచ్చిన సినిమాలు.. అతని గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఈనేపధ్యంలో ఈసినిమా వస్తుండటంతో మేజర్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది దేశవ్యాప్తంగా అందరూ తెలుసుకోవాల్సిన సినిమా కాబట్టి పాన్ ఇండియా సినిమాగా రూపొందించారు. ఇక జూన్ 10వ తేదీన ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాకు ముందుగానే ప్రీవ్యూలు వేస్తున్న సంగతి తెలిసిందే కదా. దేశవ్యాప్తంగా పలు చోట్ల ప్రివ్యూలు వేస్తున్నారు. ఈనేపథ్యంలో తాజాగా వైజాగ్ లో మేజర్ టీమ్ ఈసినిమా ప్రివ్యూను వేయడం జరిగింది. అంతేకాదు సినిమా అయిపోయిన తరువాత ప్రి రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించారు. ఇక ఈవెంట్ లో ఈసినిమా నిర్మాతల్లో ఒకరైన శరత్ వైజాగ్ ప్రివ్యూ అయిపోయిన వెంటనే రెస్పాన్స్ ఎలా ఉందో మహేష్ వెంటనే చెప్పమన్నారని అనగా.. వెంటనే అడివి శేష్ మహేష్ కు ఫోన్ చేశాడు. అయితే మహేష్ ప్రస్తుతం ట్రిప్ లో ఉండటంతో ఫోన్ లిప్ట్ చేయలేదు. దీంతో శేష్ వెంటన్ అక్కడే ఉన్న ఆడియన్స్ తో ఒక వీడియో తీసి తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ మహేష్ ను కూడా ట్యాగ్ చేసి.. మహేష్ సార్ వైజాగ్ ఆడియన్స్ కు మన సినిమా బాగా నచ్చింది.. థియేటర్ రెస్పాన్స్.. బ్లాక్ బస్టర్ రివ్యూ ఇది.. ఇప్పుడు మీ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అంటూ పోస్ట్ చేశాడు. ఇక శేష్ ట్వీట్ కు మహేష్ రిప్లై ఇస్తూ చాలా హ్యాపీ.. నాకు నచ్చినట్టే వాళ్లకి కూడా నచ్చింది.. దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి రెస్పాన్సే వస్తుందని అనుకుంటున్నా అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.
I’m glad they loved it as much as I did and India will too!! 🇮🇳🙏#MajorOnJune3rd https://t.co/hj8E7MBMk7
— Mahesh Babu (@urstrulyMahesh) May 30, 2022
శోభితా ధూళిపాళ్లతో పాటు సయీ మంజ్రేకర్ కూడా మరో కథానాయికగా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మహేష్ హోమ్ బేనర్ జీఎంబీ ప్రొడక్షన్స్ సోనీ పిక్చర్స్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, మలయాళంలో కూడా రిలీజ్ చేయనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: