“మేజర్ “మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అడివి శేష్ స్పీచ్

Adivi Sesh Speech at Major Pre Release Event,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Major,Major Movie,Major Telugu Movie,Major Movie Updates,Major Telugu Movie Updates,Major Movie Pre Release Event,Adivi Sesh Major Movie Pre Release Event,Hero Adivi Sesh, Adivi Sesh Movie Major Latest Updates,Adivi Sesh Major Pre Release Event Speech,Adivi Sesh Speech in Pre Release Event,Adivi Sesh Speech in Pre Release Event

సూపర్ హిట్ “గూఢచారి “, “ఎవరు” మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన అడివి శేష్ “మేజర్ “మూవీతో అలరించనున్నారు.సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన “మేజర్” మూవీ జూన్ 3వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో అడివి శేష్ కు జోడీగా సాయీ మంజ్రేకర్ నటించారు. ఈ మూవీ లో శోభిత ధూళిపాళ , ప్రకాష్ రాజ్ ,మురళీశర్మ , రేవతి ముఖ్య పాత్రలలో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“మేజర్ “మూవీ ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ భారీగా చేపట్టింది. ప్రమోషన్స్ లో భాగంగా “మేజర్ “మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అడివి శేష్ మాట్లాడుతూ … “మేజర్ “మూవీ ని సందీప్ తల్లిదండ్రులకు అంకితం ఇస్తున్నామనీ , ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా వారి కోసమేననీ ,సినిమా రిలీజ్ కాకుండా “మేజర్ “మూవీ ప్రీమియర్స్ ప్రదర్శించడం ఇండియన్ ఫిల్మ్ చరిత్ర లో ఫస్ట్ టైమ్ జరిగిందనీ , సందీప్ పేరెంట్స్ కు థ్యాంక్స్ అనీ , నిర్మాతల సహకారం మరువలేనిదనీ , వారే తన బలం అనీ , గురువు రైటర్ అబ్బూరి రవి గారికి థ్యాంక్స్ అనీ , “మేజర్ ” మూవీ ని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు శశి కిరణ్ తనను ఇండియన్ సూపర్ హీరోగా ప్రెజెంట్ చేశారనీ , దర్శకుడు , సంగీత దర్శకుడు శ్రీ చరణ్ , అసిస్టెంట్ డైరెక్టర్స్ కు థ్యాంక్స్ అనీ , మేజర్ సినిమా కోసం వర్క్ చేసిన ప్రతిఒక్కరు కూడా ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి వర్క్ చేశారనీ , తాను మేజర్ సందీప్ తల్లిదండ్రులకు రెండవ కొడుకుగా ఉంటాననీ , బ్లాక్ క్యాట్ కమెండోస్ కు “మేజర్ ” సినిమా ప్రదర్శింఛా మనీ , బ్లాక్ క్యాట్ కమెండోస్ హెడ్ క్వార్టర్స్ వారు తనకు ఒక మెడల్ బహూకరించారనీ , ఆ మెడల్ తనకు ఆస్కార్ అవార్డ్ కు మించిందనీ , 10 సిటీస్ లో ప్రీమియర్ షోస్ ప్రదర్శిస్తున్నామనీ , సందీప్ తల్లిదండ్రులకు బెంగుళూరు లో ప్రీమియర్ ప్రదర్శించనున్నామనీ చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + five =