అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ ఎఫ్3. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా వస్తున్న ఈసినిమా మే27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ లను బట్టి ఈసినిమా కూడా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి సిద్దంగా ఉన్నట్టు ఇప్పటికే అర్థమయిపోయింది. ఇక ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా టీమ్ మెంబర్స్ కూడా యాక్టీవ్ గానే ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈమధ్య హీరో హీరోయిన్స్ మాత్రమే కాదు టెక్నీషియన్స్ కూడా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈనేపథ్యంలోనే దేవి శ్రీ ప్రసాద్ కూడా ఈ సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దేవి శ్రీ ప్రసాద్ ఈసినిమా గురించి మాట్లాడుతూ.. ఈసినిమాకు అనిల్ రావిపూడి మంచి స్క్రిప్ట్ ను రాశారు.. ఎఫ్ 2 కంటే కూడా ఇది ఇంకా ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది.. ఈ సినిమా చూస్తూ నవ్వకపోతే నా మీదొట్టు. ఈ సినిమా చూస్తుంటే ఒక జంధ్యాల .. ఒక ఈవీవీ గుర్తుకు రావడం ఖాయమని తెలిపారు. అనిల్ రావిపూడితో వర్క్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది.. టెక్నీషియన్స్ కు ఎలాంటి స్ట్రెస్ ఇవ్వడు.. అంటూ చెప్పాడు. దేవి శ్రీ ప్రసాద్ ఎఫ్ 2కి సూపర్ ఆల్బమ్ అందించిన సంగతి తెలసిందే కదా. ఇక ఇప్పుడు ఎఫ్3 కి కూడా మంచి ఆల్బమ్ అందించారు. ఇప్పటికే రిలీజ్ అయి పాటలకు సూపర్ రెస్పాన్స్ రావడం చూస్తున్నాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: