తానా ప్రపంచ సాహిత్య వేదిక, సిరివెన్నెల కుటుంబం కలిసి శుక్రవారం శిల్పకళా వేదికలో సిరివెన్నెల జయంతి సభ నిర్వహించారు. ముఖ్య అతిథి గా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రచురించిన ‘సిరివెన్నెల సమగ్ర సాహిత్య తొలి సంపుటిని వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. వెంకయ్య నాయుడు మాట్లాడుతూ .. సినీసాహిత్యంలో విలువలను రాసులుగా పోసిన అరుదైన కవి సిరివెన్నెల సీతారామశాస్త్రి అనీ , పాట విలువను ఆర్థికంగా గాక, అర్థవంతంగా కొలిచే వారిలో ఆయన అగ్రగణ్యులనీ , సిరివెన్నెల కేవలం సినీపాటల రచయిత మాత్రమేకాదు, ఒక నిశ్శబ్ద పాటల విప్లవం, నవ్యవాగ్గేయకారుడు అంటూ అభివర్ణించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుత సినిమాలపై ఉప రాష్ట్రపతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ .. సినిమాలు వినోదంతో పాటు విజ్ఞానం కూడా పంచాలనీ , అప్పట్లో “మాయా బజార్ ” వంటి సినిమాలు 100రోజులు ఆడితే , ఇప్పటి సినిమాలు రెండో రోజు ఆడుతుందో లేదో తెలియదనీ , సినిమాలలో శృంగారం అంటే అశ్లీలంగా ఉండకూడదనీ , సినిమాలు ప్రేక్షకులకు సంస్కారం నేర్పించాలనీ , సినిమాల తీరును చిత్ర పరిశ్రమ సరిదిద్దకోవాలనీ చేప్పారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: