చిరంజీవి : మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ నుండి డిప్లొమా పొందిన తరువాత “పునాది రాళ్లు”( 1978)మూవీ తో చిరంజీవి కెరీర్ ప్రారంభించినా ” ప్రాణం ఖరీదు” మూవీ ముందుగా విడుదల అయ్యింది. సక్సెస్ ఫుల్ “మనవూరి పాండవులు ” మూవీతో చిరంజీవి గుర్తింపు పొందారు. కొన్ని సినిమాలలో చిన్న పాత్రలు, ప్రతినాయక పాత్రలు పోషించిన చిరంజీవి సక్సెస్ ఫుల్ “ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య” మూవీ తో హీరోగా మారారు. బ్లాక్ బస్టర్ “ఖైదీ” మూవీ తో చిరంజీవి కి స్టార్ డమ్ వచ్చింది. పలు యాక్షన్ మూవీస్ లో చిరంజీవి అద్భుతమైన తన డ్యాన్స్ , ఫైట్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ మెగా స్టార్ గా మారారు. 4 శతాబ్దాలుగా 150 సినిమాలకు పైగా నటించిన చిరంజీవి సినీ కెరీర్ లో “ఖైదీ” , “యముడికి మొగుడు “, “గ్యాంగ్ లీడర్ “, “ముఠా మేస్త్రి “, “ఇంద్ర “, “ఠాగూర్ “, “శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్.”, “స్టాలిన్ “, “ఖైదీ నెం 150 ” మూవీస్ ఆణిముత్యాలుగా నిలిచాయి. పలు మూవీ కమిట్ మెంట్స్ తో చిరంజీవి బిజీగా ఉన్నారు . 60+ఏజ్ ఉన్నా చిరంజీవి , యువ హీరోలతో పోటీపడి నటించడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బాలకృష్ణ : లెజెండరీ యాక్టర్ నందమూరి తారకరామారావు తనయుడు బాలకృష్ణ “తాతమ్మ కల”(1974 ) మూవీ తో కెరీర్ ప్రారంభించి , “సాహసమే జీవితం “మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. సూపర్ హిట్ “మంగమ్మ గారి మనవడు “మూవీ తో బాలకృష్ణ మాస్ ఆడియెన్స్ కు దగ్గరయ్యారు. అద్భుతమైన యాక్టింగ్ , డైలాగ్ డెలివరీ తో ప్రేక్షకులను అలరిస్తున్న బాలకృష్ణ రాయలసీమ ఫ్యాక్షన్ మూవీస్ కు పెట్టింది పేరుగా మారారు.నాలుగు దశాబ్దాలకు పైగా 100 సినిమాలకు పైగా నటించిన బాలకృష్ణ సినీ కెరీర్ లో “ముద్దుల మావయ్య “, నారీ నారీ నడుమ మురారి”లారీ డ్రైవర్ “, ఆదిత్య 369 “, రౌడీ ఇన్ స్పెక్టర్ “, “బంగారు బుల్లోడు “, “భైరవ ద్వీపం “, “సమరసింహా రెడ్డి “, “లక్ష్మీ నరసింహా “, “సింహా “, “లెజెండ్ “, “గౌతమీ పుత్ర శాతకర్ణి” మూవీస్ ఘనవిజయం సాధించాయి. బాలకృష్ణ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “అఖండ “మూవీ ఘనవిజయం సాధించి బాలకృష్ణ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలిచింది. హీరో బాలకృష్ణ ప్రస్తుతం “#NBK107 ” మూవీ లో నటిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ : “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి “(1996 )మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన మెగా స్టార్ చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ “గోకులం లో సీత “, “సుస్వాగతం ” వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ “తొలి ప్రేమ ” మూవీ తో హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. తన మేనరిజం , డైలాగ్ డెలివరీ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకునే పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అధికమే. అభిమానులు పవర్ స్టార్అని పిలుచుకునే పవన్ కళ్యాణ్ నటించిన “బద్రి”, “ఖుషి “, “జల్సా “, “గబ్బర్ సింగ్ “,”అత్తారింటికి దారేది”, “వకీల్ సాబ్ “, “భీమ్లా నాయక్ “మూవీస్ ఘనవిజయం సాధించాయి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “హరి హర వీరమల్లు “మూవీ లో నటిస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో “భవదీయుడు భగత్ సింగ్ “మూవీ కి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. యాక్టర్ , సింగర్, రైటర్ , కొరియోగ్రాఫర్ , స్టంట్ డైరెక్టర్ , నిర్మాత , దర్శకుడిగా పవన్ కళ్యాణ్ సినీ కళామతల్లి కి సేవలు అందిస్తున్నారు. ప్రజా సేవ కై పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ని స్థాపించారు.
రవితేజ : 1991 సంవత్సరం సినీ ఇండస్ట్రీ కి చేరుకున్న రవితేజ పలు మూవీస్ లో చిన్న చిన్న పాత్రలలో నటించారు. దర్శకుడు కృష్ణవంశీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. 1997 సంవత్సరంలో కృష్ణవంశీ తెరకెక్కించిన “సిందూరం “మూవీ లో సెకండ్ హీరోగా రవితేజ నటించారు. “నీ కోసం “(1999) మూవీ తో రవితేజ హీరోగా మారారు. సక్సెస్ ఫుల్ “ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం” మూవీ తో గుర్తింపు పొందిన రవితేజ “ఇడియట్ “మూవీ తో హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. కామెడీ టచ్ ఉన్న యాక్షన్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ రవితేజ ప్రేక్షకులను అలరిస్తున్నారు. రవితేజ హీరోగా తెరకెక్కిన “ఖడ్గం “, “అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి “, “వెంకీ “, “భద్ర “,”విక్రమార్కుడు “, “కిక్ “, “డాన్ శ్రీను “, “”పవర్ “, “బెంగాల్ టైగర్ “, “రాజా ది గ్రేట్ “, “క్రాక్ ” మూవీస్ ఘనవిజయం సాధించాయి. పలు యాక్షన్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రవితేజ ను అభిమానులు మాస్ మహారాజా గా పిలుచుకుంటారు. రవితేజ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు.
[totalpoll id=”80665″]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: